Featured Post

Adimurai Martial Arts | Oldest Martial Arts In The World | Indian Martial Arts Telugu | Adimurai

మనం చూసిన ఎన్నో మార్షల్ ఆర్ట్స్ మూవీస్ లో కరాటే, టైక్వాండో, బాక్సింగ్, జూడో, కళరిపయట్టు,చైనీస్ మార్షల్ ఆర్ట్స్, తాయ్ చి, వింగ్ చున్, సాండా ఇదే ఇప్పటి చైనీస్ కిక్‌బాక్సింగ్, షావోలిన్ కుంగ్ ఫూ ఇలా ఇంకెన్నో పేర్లను వింటూ ఉన్నాం. శిలాత్, కరాటే, జూడో, అకిడో వంటి మార్షల్ ఆర్ట్స్ పుట్టింది కూడా మన దేశం లో ఊపిరి పోసుకున్న  ఆడిమురై అనే ఒక ప్రాచీన యుధకలనుంచే. అవును మానవ శరీరాన్ని అదుపులో ఉంచగలిగి  ఎంతటి దీరుడినయిన మట్టికరిపించాగల శక్తి ఈ ఆడిమురై కి ఉంది.

Watch Full Video Here 

           

ఆడిమురై  అనేది ఒక తమిళ యుద్ధ కళ, ఇది పురాతన తమిళకం లో అభ్యసించిన  అతి ముఖ్యమైన యుద్ధ కళలలో ఒకటిగా పరిగణించబడుతుంది. తమిళకం అంటే నేటి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్  ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక లోని  దక్షిణ భాగాలను కలిపి తమిళకం అన్ట్టారు. ఈ పేరు తమిళం లోని అడి మరియు మురై అనే  రెండు పదాలను కలిపి అడిమురై అని పిలుస్తారు. అడి అంటే మన వాడుక బాషలో "కొట్టడం" మరియు మురై అంటే విధానం లేదా పద్ధతి . మొత్తంగా కొట్టే పద్ధతి లేదా కొట్టే విధానం. అడిమురై కన్యాకుమారిలోని తమిళనాడు తిరునెల్వేలి యొక్క దక్షిణ భాగాల నుండి ఉద్భవించిందని నమ్ముతారు. ఆధునిక కాలంలో దీనిని తమిళ సాయుధ కళలో ఉపయోగించారు.



ఈ పురాతన పోరాట శైలి క్రీ.పూ 400 లో తమిళ సంగం సాహిత్యంలో ప్రస్తావించబడింది. ఆత్మ రక్షణ కళ్ళల్లో మొట్ట మొదటిదైన ఈ ADIMURAI దక్షిణ భారత దేశంలోని చేల చొర పాండ్యులు యుద్ధాల కోసం వారి దళాలలో ఉపయోగించేవారు. వర్మ కళ యొక్క కళను రూపొందించడానికి వాసి యోగ మరియు వర్మ వైద్యం లతో పాటు మూడవ విభాగాగంలో అడిమురై ఒకటి.  ఈ వర్మ కళనే Marma-Vidya Kaḷa అని అన్ట్టారు. అందుకనే ఈ మర్మ కళను నేర్చుకునే వారికి ముందుగా అడిమురై ని నేర్పిస్తారు. దొంగలు మరియు శత్రువుల నుండి తమను తాము రక్షించుకోవడం కోసం అడిమురైని మొదట సిద్ధులు ప్రాణాంతకమైన సమర్థవంతమైన పోరాట శాస్త్రంగా  ఈ ప్రపంచానికి పరిచయం చేశారు.

                                                   
Angampora / CC BY-SA (https://creativecommons.org/licenses/by-sa/3.0)
                                                                                           Image Source 

ఈ క్రీడ మరొక యుద్ధ కళ సిలంబంతో దగ్గరి సంబంధం కలిగి ఉంది, అందుకే దీనిని సిలంబట్టం అని కూడా పిలుస్తారు. సిలంబం మాదిరిగానే అడిమురై యొక్క మూలం క్రీస్తుపూర్వం 2 వ శతాబ్దం నాటిది. అడిమురైలో, పోరాటం కేవలం చేతులతో లేదా కర్ర లేదా  మొద్దుబారిన ఆయుధంతో జరుగుతుంది.  నరాలు, సిరలు, కండరాలు , మృదు కణజాలాలు లేదా ఎముక కీళ్ళను లక్ష్యంగా చేసుకుని పోరాటంలో దిగుతారు. మన దేశం నుంచి యోగ మరియు కొన్ని అతి ప్రాచీన కళలు ఎలా అయితే మరుగున పడి అంతరించిపోయాయో ఇది కూడా అదే ప్లేస్ లో చేరిపోయింది. ఎక్కడో కొతమంది దగ్గర తప్ప చాల మందికి ఈ పేరు కూడా తెలియదు. యుధ రంగం లో ఆయుదాలు లేకుండా కూడా వొట్టి చేతులతో వేల లక్షల మందిని ఎందిరించి తరిమికొట్టిన చరిత్ర ఈ అడిమురై సొంతం.


భారతదేశంలో బ్రిటిష్ పాలన స్థాపించబడినప్పుడు, అన్ని రకాల మార్షల్ ఆర్ట్స్ నిషేధించబడ్డాయి. తరువాతి 200 సంవత్సరాలు కూడా , భారతీయులు తమ కళలు, సంస్కృతి మరియు సంపద యొక్క అపూర్వమైన విధ్వంసం మరియు దోపిడీని చూశారు. మార్షల్ ఆర్ట్స్ లేదా కంబాట్ స్పోర్ట్స్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నింటినో  నిషేధించారు.! ఆ కాలం నుంచే అడిమురై మరుగునపడుతూ వచ్చింది. బ్రిటీష్ వారు వెళ్ళిన తరువాత కూడా, వారు వదిలిపెట్టిన సాంస్కృతిక కళంకం, విద్యావంతులైన భారతీయులలో ఎక్కువమంది ఆంగ్లీకరించిన సంస్కృతిని అనుకరించటానికి ప్రయత్నిస్తున్నారు మరియు వారి సొంత సంప్రదాయాల నుండి కూడా దూరంగా ఉన్నారు. అక్కడక్కడ మిగిలిన కొంతమంది ద్వారానే ఇప్పటికి కొంతమంది ఈ అడిమురై ను బోధిస్తున్నారు.


ఈ అడిమురై లో రెండవరకం ఆయుధ మురై (వెపన్ సైన్స్):

ఆయుధ మురై ఆయుధ ఆధారిత భాగం అంటే అనేక ప్రత్యేకమైన ఆయుధాలు ఉపయోగించి మాత్రమే దీనిని చేస్తారు. ఆయుధ మురై ప్రధానంగా ప్రాణాంతకమైనది. మిగిలిన మార్షల్ ఆర్ట్స్ అన్ని కూడా మాములుగా చేసిన ఈ ఆయుధ మురై ని మాత్రం కేవలం యుధ రంగానికి మాత్రమే
పరిమితం చేసారు. ఎందుకంటే దీనిలో ప్రాణాలకు చాల రిస్క్ ఉంటుంది. ఆయుధ మురైలో ఉపయోగించే ప్రధాన ఆయుధాలు:

                                   
                                                                                                                © Angampora
నీల్ కంబు (లాంగ్ స్టిక్)
సేధి కుహి (చిన్న కర్ర)
వాల్ (కత్తి)
సురుల్ (సౌకర్యవంతమైన లాంగ్ బ్లేడ్ ఆయుధాలు)
కత్తి (కత్తి)
వెట్టు కత్తి (ఒక రకమైన వేట కత్తి)
ఇలా అనేక రకాల చిన్న పెద్ద ఆయుధాలను ఉస్ చేసి అప్పట్లో యుదాలను చేసే వారు. ఇప్పటికాలం యుద్ధాలలో వీటి అవసరం లేదు కాబట్టి వీటి గురించి చెప్పడం కాదు కదా కనీసం మాట్లాడుకోవడమే మానేశారు. సైన్స్ చెప్పలేని ఎన్నో ప్రశ్నలకు వందల వేల సంవస్చారాల క్రితమే  మన ఋషులు పండితులు ఆ ప్రశ్నలకు సమాధానాలు కూడా మన గ్రంధాలలో పొందుపరిచారు. ఒక అంచనా ప్రకారం 60% తాళపత్రాలు లేదా ఇతరత్రా గ్రంధాలు నాశనం చేయబడో లేదా పరాయిదేసాలు దొంగిలింఛి ఉంట్టారు అని ఒక అంచనా. యోగ ని మెడిటేషన్ కోసం మాత్రమే కాదు అనేక రకాల రోగాలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఈ యుధ కళలు అన్ని కూడా కొట్టుకోవడానికి మాత్రమే కాదు మానవ శరీరంలోని కొన్ని Vital Spots ను గుర్తించి బాగుచేయగల సామర్ధం దీనికి ఉంది అని ఒక నమ్మకం. అందుకే చైనీస్ మరియు థాయిలాండ్ కు సంబందించిన కొంతమంది ఈ martial ఆర్ట్స్ మీద రీసెర్చ్ లు చేస్తున్నారు.

చెన్నై లోని కొంతమంది పోలీసులు కూడా ఇటీవల కాలంలో ఈ అడిమురి ను నేర్చుకోవడం కోసం Mugilan అనే అడిమురై expert దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకునారు. మన ప్రాచీన కళల్లో ఒకటయిన అడిమురై గురించి కొంతయిన తెలుసుకున్నారు అని అనుకుంటున్నా . ఇలాంటి మరీనో ఇంటరెస్టింగ్ టాపిక్స్ ను మన ఛానల్ లో చూడాలి అని అనుకుంటే తప్పకుండ మన ఛానల్ కు సబ్స్క్రయిబ్ చేసుకోండి. YouTube


ఇప్పటికి చాలా మందికి ఇలాంటి గొప్ప మార్షల్ ఆర్ట్స్ ఉన్నటు కూడా తెలియదు. అందుకని కచితంగా ఈ పోస్ట్ ను షేర్ చేసి కనీసం కొంతమందికయినా తెలిసేలా చేద్దాం.

#అడిమురై #indianmartialarts #adimurai #oldestmartialarts #karate #judo #boxing #adimuraitelugu #fulldetailsofadimurai




Adimurai Martial Arts | Oldest Martial Arts In The World | Indian Martial Arts Telugu | Adimurai Adimurai Martial Arts | Oldest Martial Arts In The World | Indian Martial Arts Telugu | Adimurai Reviewed by M. Prabhakara Reddy on May 12, 2020 Rating: 5

No comments

If you have any doubts please let me know.

Featured Post

Top 10 Best Wireless Headphones In 2024 | 10 Best budget Wireless Bluetooth Headsets To Buy In 2024

Depending on the device we use, the audio video visuals we see can change in a moment. Video quality depends on larger HDR screens ...

Ads Home

Travel everywhere!