Featured Post

Naga Bandhanam | Naga Bandham Full Story | NagaBandham Mystery Revealed | Anantha Padmanabha Swamy

        నాగబంధనం అనే టాపిక్ గురించి మాట్లాడుకోవాలి అంటే ముందుగా కచ్చితంగా మన హిందూ పురాణాల లో వీటి ప్రస్తావన గురించి చెప్పుకుని తీరాలి. ప్రపంచం మొత్తం లో ఒక్క భారత దేశంలోనే నాగుపాములని దైవంగా భావిస్తారు. వీటికోసం ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తారు. ఇలా పూజించడానికి ముఖ్యకారణం, హిందూ పురాణాలలో నాగుపాములు  దేవతలుగాను, ఆరాధ్య దేవుల్లగాను ఉండేవి అని, దేవ ఘనాలుగా ఈ నాగుపాములకు ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించబడింది అని వాటిలో చెప్పడం జరిగింది. అటువంటి నాగుపాముల యొక్క శక్తిని కొన్ని రకాలా ప్రత్యేకమయిన తాంత్రిక విద్యలతో ఒక గది తలుపుకు కాని ఇంటికి కాని ఒక రకమయిన బంధం లా వేస్తారు. దానినే మనం నాగ బంధం అంటాం.

      ఈ నాగ బంధానికి చాల శక్తి ఉంటుంది కాబట్టి, ఇలా వేసిన నాగ బంధాన్ని సరయిన పద్దతిలో తొలగించకుండా లోపలకు ప్రవేశించాలని చూస్తే అక్కడ పెద్ద అనర్ధం ఎదో జరుగుతుందని, ఎన్నో ప్రాణాలు కూడా కోల్పోతామని అనేక మంది నమ్మకం. అసలు ఈ నాగబంధం అంటే ఏమిటి, ఎలా దీనిని వేస్తారు అనే దానిగురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

      నాగబంధం అనేది ఇండియన్ హిస్టరీ లో ఎన్నో వేల సంవస్చారాల క్రితం నుంచే ఉంది. కాకపోతే గత 6-7 సంవస్చరాలుగా మన దేశం మాత్రమే కాదు, యావత్ ప్రపంచం అంతా పాపులర్ అయింది మాత్రం కేరళలోని ట్రావెన్ కోర్ సంస్థాన ఆధీనంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడి వల్లనే. ఈ గుడిలో అప్పట్లో లక్షల కోట్లు విలువయిన బంగారు ఆబరణాలు, బంగారు నాణాలు, వందల కోట్ల విలువయిన వజ్రాలతో పొదిగి ఉన్న బంగారు విగ్రహాలు ఇలా ఒకటి రెండు కాదు అనంత సంపద బయటపడేసరికి ప్రపంచంలోనే అంత్యంత సంపద కలిగిన ఆలయంగా మారిపోయింది ఈ గుడి. కాని అక్కడే ఉన్న ఆరవ గదిని మాత్రం ఇప్పటికి తెరవలేకపోయారు. ఎందుకంటే ఆ గది తలుపుకు నాగబంధనం వేసి ఉండటం వల్ల, ఈ గది తలుపు తెరిస్తే ప్రళయం వస్తుంది అని, అనేక అనర్ధాలు జరుగుతాయని, ఈ గదిలో నుంచి  కేరళా లో ఉన్న సముద్రానికి డైరెక్ట్ గా లింక్ ఉందని, పొరపాటునయిన ఆ తలుపు ఓపెన్ చేస్తే సముద్రంలోని నీరు అంతా ఆ తలుపు ద్వారా బయటకు వచ్చి ఆ ప్రాంతాన్ని అంత ముంచేస్తుంది అని ఇలా అనేక రకాల వాదనలు ఉన్నాయి. 

      ఇందులో ఎది నిజమయిన కాకపోయినా కూడా ఆ తలుపును తెరిచే ప్రయత్నాలలో కొన్ని ప్రాణాలు కోల్పోయినట్టు చెబుతారు. ఈ గుడిలో మొత్తం 6 గదులకు A B C D E F అనే పేర్లను పెట్టి పిలిచేవారు. ఇందులో చివరి రెండు గదులు అయిన E,F గదులు రెగ్యులర్గా తెరుస్తారు. రోజు స్వామికి అలంకరించే ఆభరణాలు ఈ రెండు గదులలోనే ఉన్ట్టాయి. C మరియు D గదులను మాత్రం సంవస్చారానికి 3 సార్లు మాత్రమే తెరుస్తారు. దేవుడి ఊరేగింపు లేదా పండగ రోజు ధరించే ఆభరణాలు వీటిలో ఉన్ట్టాయి. 

       చివరిగా మిగిలినవి A B గదులు మాత్రమే. 2007 లో  TP సుందర్ రాజన్ అనే అడ్వకేట్ అనంత పద్మనాభస్వామి గుడిలో అంతులేని సంపద ఉందని, అది కొంచం కొంచంగా తగ్గుతూ వస్తుంది అని సుప్రీంకోర్టు లో కేసు వేసాడు. అక్కడ ఉన్న ఆభరణాలను లెక్కించి చెప్పాల్సిందిగా కోర్ట్ తీర్పునించింది. దీనికోసం నియమించిన కమిటీ సిబ్బంది ఒక్కో గది తెరుస్తుతూ ఆభరణాలను అక్కడ ఉన్న విలువయిన సంపదను లెక్కించడం స్టార్ట్ చేసారు. 

       C D E F గదులను లెక్కించిన కమిటీ మెంబెర్స్ A మరియు B గదుల దగ్గర వచ్చారు. అప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉస్ చేసి దాదాపుగా 7 గంటలపాటు కష్టపడి A గది డోర్ తెరిచారు. కాని అక్కడ కాలీగా ఉన్న గదిలో దుమ్ము దూలి తప్ప ఏమి లేదు. సరే అని ఆ గదిని క్లీన్ చేస్తుంటే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళడానికి మరొక సీక్రెట్ డోర్ కనిపించింది. అది తెరిచి చూడగానే అక్కడ ఉన్న ఎవరికీ కూడా నోట మాట లేదు. అంత సంపదను వాల్ల జీవితం లో ఎన్నడు చూడలేదు. లెక్కపెట్టలేనంత, లెక్క లేనంత బంగారు ఆభరణాలు, వజ్రాలు, బంగారు నాణాలు, ఇలా ఒకటి రెండు కాదు టన్నుల్ల కొద్ది ఉన్న్డటం చూసి ఆశ్చర్య పోయారు. ఈ ఒక్క గదిలో ఉన్న సంపద లెక్క చెప్పడానికే 6 నెలల టైం పట్టింది అంటే మీరే ఆలోచించండి ఆ నేల మాలిగలలో ఎంత సంపద దాచిపెట్టారో. మార్కెట్ వేల్యూ ప్రకారం నేటికి వీటి విలువ దాదాపుగా 15లక్షల కోట్ల రూపాయలు. ఇది జస్ట్ ఒక అంచనా మాత్రమే, వీటి వేల్యూ ఇంకో రెండు మూడు రెట్లు పెరిగే అవకాసం కూడా లేకపోలేదు. 

       అన్ని గదులను తెరిచారు కాని B గది తలుపును మాత్రం తెరువలేకపోయారు. ఈ గది తలుపులు ఐరన్ తో మరియు బయంకరమయిన రెండు పాములతో ఉన్న డిజైన్ తో ఉంది. మరీ ముక్యంగా ఈ తలుపులకు తాళాలు ఉపయోగించి తీసే వెసులుబాటు లేదు, వాటికి కనీసం చిన్న రంధ్రం కూడా లేని విధంగా నిర్మించారు. ఆ గదికి నాగబంధం ఉందని, ఆ గది తలుపులు ఓపెన్ చేస్తే ప్రమాదం వాటిల్లుతుంది అనే నమ్మకంతో, ప్రజల మనోభావాలు దెబ్బ తీయడం ఇష్టం లేక కోర్ట్ కూడా స్టే ఇచ్చింది. అదే సమయంలో కోర్ట్ లో పిటిషన్ వేసిన సుందర రాజన్ చనిపోవడం భక్తుల అనుమానాలను మరింత పెంచింది. మిగతా కమిటీ సభ్యులలో కొంతమందికి అనారోగ్యం, చిన్న చిన్న ఆక్సిడెంట్స్ జరిగే సరికి అందరిలోనూ భయం మొదలయింది. A గది తెరిచినప్పటి నుంచి ఇలా ఎదో ఒక ఆటంకం జరుగుతుంది అని, ఇక నాగాబంధనం వేసిఉన్న ఈ B తలుపును కూడా తెరిస్తే నిజంగానే ప్రమాదాలు జరిగుతాయేమో అని ముందుకు వెళ్లలేకపోయారు. 

        ఈ నాగబంధం మిస్టరీ విషయానికి వస్తే, పూర్వకాలం నుంచి కేరళకు చెందిన తాంత్రికులు నాగబంధనం వెయ్యడంలో ప్రసిద్ధులు. అయితే ఈ బంధనం వెయ్యడం అంత సామాన్య విషయం కాదట. తాంత్రిక విద్యలలో అనుభవం ఉన్న సిద్ధ పురుషులు, యోగులు వంటి వారే వీటిని ఒక క్రమ బద్ధం లో వెసేవారట. ఇలా వేసిన నాగబంధం విప్పడం కూడా అత్యంత ప్రమాదకరమయిన పని అని చెబుతారు. బంధనం వేసే సమయంలో కొన్ని విషపూరితమయిన నాగులను ఆవాహనం చేసుకుని, ఏదయినా గదికి కాని లేదా సంపదకు కాని వాటిని కాపలాగా ఉంచుతారట, ఒకసారి నాగబంధం వేస్తే, అవి కొన్ని వేల సంవస్చారాల వరకు వాటిని కాపాడుతాయని, మరలా వాటిని తీయాలి అంటే అత్యంత ప్రమాదకరమయిన గరుడ మంత్రాన్ని ప్రయోగించాలి అని అలా కాదని వాటిని తెరవాలని చూస్తే ఎదో పెద్ద ప్రమాదమే జరుగుతుంది అని చెబుతారు. కాకపోతే గరుడ మంత్రం తెలిసినవారు పరమ నిష్టా గరిస్టు లు అయ్యి ఉండాలి. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా వినాశనానికి దారితీస్తుంది అని ప్రాచీన గ్రంధాలలో రాయబడి ఉంది. 

      ఒకవేళ నిజంగానే ప్రయత్నించినా  అందులో కొన్ని చిక్కులు ఉన్నాయి. మన పురాణాల ప్రకారం మనకు 8 దిక్కులు ఉన్నాయి. ఆ 8 దిక్కులలో ఒక్కొక దిక్కుకూ ఒక్కొక నాగ దేవత కాపలా కాస్తుంది అని అన్ట్టారు. అయితే నాగబంధం వేసిన చోట ఏ నాగ దేవత ఉందో, ఆ నాగబందానికి ఏ రకమయిన మంత్రం ఉపయోగించారో తెలిస్తే కాని ఆ నాగాబందాన్ని విప్పడం జరగదని అన్ట్టారు. మన పూర్వీకులు వీటిమీద రాసిన తాళపత్ర గ్రంధాలు చాల తక్కువ అనే చెప్పాలి. అవి కూడా రానురాను కనుమరుగవుతున్నాయి. దీనికి విరుగుడుగా గరుడ మంత్రం ఎంత అవసరమో, అదేవిధంగా నాగబందానికి ఏ రకమయిన మంత్రం ఉపయోగించారో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం అని చెబుతారు. 

           ఈ తలుపులు తీయడానికి ప్రయత్నాలు జరిగినప్పటినుంచి కేరళ లో అరాచకాలు ఎక్కువ అయిపోయాయని, ఎన్నడు ఎరుగని  ప్రకృతి బీభత్సాలు, గత దశాబ్ద కాలంగా కేరళ రాష్ట్రంలో జరిగిన అనేక ఘటనలకు ఈ నాగబంధం వేసిన తలుపు తెరువడానికి జరిగిన ప్రయత్నాలే కారణం అని జనం బలంగా నమ్ముతున్నారు. 2018లో మరోసారి తలుపులు తెరవాలి అని అనుకునే సమయానికి, కేరళ రాష్ట్రం చరిత్రలో ఎరుగని ప్రకృతి బీభత్సాలను ఎదుర్కుంది. ఎప్పుడు లేని విధంగా ఒకే సారి తుఫానులు వరదలు కేరళను ముంచ్చేతాయి. వీటిలో 483 మంది చనిపోగా, 140 మంది గల్లంతయ్యారు. అదే సంవత్సరంలో నిఫా వ్యాది కూడా కేరళ రాష్ట్రాన్ని ఊపిరి కూడా పీల్చుకోనివ్వకుండా చేసింది. దేవాలయ ప్రధాన పూజారి అయిన పుష్పాంజలి స్వామి యార్ ఆరోగది తెరవడాన్ని విరమించుకోవాలని ప్రభుత్వానికి లేక రాయడంతో అక్కడితో అన్ని ప్రయత్నాలు ఆగిపోయాయి. 

       నిజంగానే వీటికి అంతటి మహత్యాలు మాయలు ఉంట్టాయా అంటే, అవుననే అంటున్నారు పండితులు. వీటిని సాధారణంగా తీసుకోవద్దని, భవిష్యత్తు తరాలకు ముప్పు తీసుకువచ్చే పనులు చేయొద్దు అని హెచ్చరిస్తున్నారు.

జైహింద్.!

   

Naga Bandhanam | Naga Bandham Full Story | NagaBandham Mystery Revealed | Anantha Padmanabha Swamy,naga bandham,naga bandhanam,nagabandhanam full story,naga bandhanam mystery,naga bandham mystery,anantha padmanabhaswami door,snake chambers in hindu temples,telugu real facts,real facts,hindu facts,indian culture,indian thanthirka,thanrika vidhyalu,my show my talks,nagabandam in telugu,naga bandhanam in telugu,Indian secrets,secrets of hindu temples,secret




Naga Bandhanam | Naga Bandham Full Story | NagaBandham Mystery Revealed | Anantha Padmanabha Swamy Naga Bandhanam | Naga Bandham  Full Story | NagaBandham Mystery Revealed | Anantha Padmanabha Swamy Reviewed by M. Prabhakara Reddy on November 30, 2021 Rating: 5

No comments

If you have any doubts please let me know.

Featured Post

Top 10 Best Wireless Headphones In 2024 | 10 Best budget Wireless Bluetooth Headsets To Buy In 2024

Depending on the device we use, the audio video visuals we see can change in a moment. Video quality depends on larger HDR screens ...

Ads Home

Travel everywhere!