Featured Post

Best Smartphones Under 15000 | Best Smartphones For Gaming | Best Phones For Pubg

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేకుండా రోజు గడవదు. నేటి తరాన్ని టెక్నాలజీ బాగా ప్రభావితం చేసింది. నేటి ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ ద్వారా గుండుసూదులు నుండి విమాన భాగాల వరకు ఆర్డర్‌ చేయగల సాంకేతికతను మనం చూస్తున్నాము, మరియు ప్రపంచంలో ఎక్కడినుంచి అయిన సరే మనం ఉన్న ప్లేస్ దగ్గరకు వాటిని రప్పించగలం. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికి మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా మన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో వారికి దగ్గరగా ఉన్నట్లు  మాట్లాడటానికి ( వీడియో కాలింగ్ ) ఈ ఫోన్‌లు చాలా అవసరం.

Best Smartphones Under 15000

Click Here To Buy Best Smart Phones Under 15000

ఈ ఫోన్లు మన చుట్టూ ఏమి జరుగుతుందో క్షణాల్లో తెలుసుకోవడానికి మీడియా వ్యవస్థగా పనిచేస్తాయి. మారు మూల పల్లెల నుంచి సిటీ ల వరకు ఏ న్యూస్ ని అయిన ఇంట్లో కూర్చుని మన చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ లో ఒక్క క్లిక్ చేస్తే చాలు అన్ని అవే చూపిస్తాయి. ఈ కరోనా మహమ్మారి సమయంలో దేశాలన్నీ లాక్డౌన్ లో ఉనప్పుడు ఇంట్లో అందరికి ఒకే ఒక్క కాలక్షేపం ఈ ఫోన్స్. గేమ్స్ ఆడినా, మూవీస్ చూసినా, లేదా గర్ల్ ఫ్రెండ్ తో చాట్ చేసినా ఇవి లేకుండా చేయలేము. ఒక్కసారి ఆలోచించండి ఈ ఫోన్స్ అనేవి లేకుండా లాక్ డౌన్ లో మనమందరం ఉండిపోయి ఉంటె? అమ్మో ఆ ఊహ కూడా చాల భయంకరంగా ఉంది కదు! 
   కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు మరియు కళాశాలలు ఎప్పుడు తెరుస్తారో ఏ ప్రభుత్వాలు చెప్పలేవు. అందుకే చాలా కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు తమ విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించాయి. ఆన్లైన్ క్లాస్ ల విషయం లో ప్రభుత్వాల ఆంక్షలు ఉన్నా ఈ సంస్థలు అవేవి పట్టించుకోకుండా విద్యార్దులను వారి తల్లితండ్రులను ఫీజులతో పాటు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు.  అందులో ముఖ్యమయినది ఆన్లైన్ క్లాసెస్. ఫీజు కట్టడానికే కష్టంగా ఉన్న కరోనా సమయంలో పిల్లలకు స్మార్ట్‌ఫోన్స్ కొనాలి అంటే ఎలా సాధ్యం. ఇప్పటికే చాల మంది తల్లి తండ్రులు ఒకపూట తింటూ మరో పూట పస్తులుంటూ వారి పిల్లలను చదివిన్చుకున్ట్టున్నారు. 
ఇదంతా కూడా చేతికి వచ్చింది రాసింది కాదు.  నా రియల్ ఎక్స్ పీరియన్స్. నాకు తెలుసిన ఒక రోజు కూలి తన కొడుకు చదువుకోసం స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవాలి అని తన కొడుకు చదివే స్కూల్ యాజమాన్యం చెప్పడం కాదు ఏకంగా ఆర్డర్స్ పాస్ చేసింది అంట.
ఆ రోజు కూలికి ఇవేమీ తెలియవు తను నా దగ్గరకు వచ్చి, " అయ్యా మా అబ్బాయి చదువు కోసం అదేదో ఫోన్ అంట అయ్యా అది కావలయ్య " అంటూ నాకు చెప్పాడు. తను రోజు పనిలోకి వెళ్తే కాని ఆ ఇంట్లో తినడానికి తిండి ఉండదు. అయిన సరే తన కొడుకుని కష్టపడి చదివిస్తున్నారు. ఎందుకు కానీసం వాడయిన బాగా చదువుకుని ఒక నాలుగు డబ్బులు సంపాదిన్చుకున్ట్టాడు అని. కాని ఆకరికి ఏమయింది ఇప్పుడు. అందుకే నా దగ్గర ఖాళీగా పడి ఉన్న ఒక స్మార్ట్ ఫోన్ ను తనకు ఇచ్చి ఎలా వాడలో తన కొడుకుకి చెప్పాను. కాని ఇదే పరిస్థితి లో ఇంకా చాలా మంది తల్లి తండ్రులు ఉన్నారు. మీ దగ్గర కూడా కాళీగా పడిఉన్న ఫోన్స్ ఎమన్నా ఉంటె అలాంటి వారికి ఇవ్వండి. 




Best Smartphones Under 15000 | Best Smartphones For Gaming | Best Phones For Pubg Best Smartphones Under 15000 | Best Smartphones For Gaming | Best Phones For Pubg Reviewed by M. Prabhakara Reddy on July 10, 2020 Rating: 5

No comments

If you have any doubts please let me know.

Featured Post

Top 10 Best Wireless Headphones In 2024 | 10 Best budget Wireless Bluetooth Headsets To Buy In 2024

Depending on the device we use, the audio video visuals we see can change in a moment. Video quality depends on larger HDR screens ...

Ads Home

Travel everywhere!