Featured Post

How Tropical Cyclones Are Named | How Cyclones Are Named | అసలు ఈ తుఫాన్ లకు పేర్లు ఎవరు పెడతారు?

  
      సైక్లోన్, తుఫాన్ ఇలా పేరు ఏదయినా సరే అది వచ్చింది అంటే బీభత్సం చేసి వెళ్ళిపోతుంది. ఆస్థి నష్టం తో పాటు ఎన్నో కొన్ని ప్రాణాలను కూడా ఈ తుఫాన్ లు తీసుకుపోతాయి. మన చిన్నతనం నుంచి ప్రకృతి బీభత్సలలో ఒకటయిన ఈ తుఫాన్ లను ప్రతీ సంవస్చ్చారం  చూస్తునే ఉన్నాం. చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వచ్చింది అంటే సరదా తీర్చేస్తుంది. అటువంటి ఈ ఉత్తర హిందూ మహాసముద్రంలోని  ఉష్ణమండలం లో ఏర్పడే ఈ తుఫాన్లకు ఎవరు పేర్లు పెడతారు. ఈ విధంగా తుఫాన్లకు పేర్లు పెట్టాల్సిన వసరం ఏంటి. వేటిని పరిగానలోనికి తీసుకుని వీటిని నిర్ణయిస్తారు వంటి మరీన్నో ఇంటరెస్టింగ్ విషయాలను  మీతో షేర్ చేసుకోబోతున్నా. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వేల్లిపోదాం.
Watch Full Video Here
           
                    తుఫాన్ కు సంబందించిన పేర్లు గురించి తెలుసుకునే ముందు అసలు ఈ తుఫాన్ అంటే ఏంటి ఇవి ఎలా ఏర్పడతాయో ముందు తెలుసుకోవాలి. పేర్లు ఎలా పెడతారో చెబుతా అని వీడియో పెట్టి సోది చెబుతున్న అనుకోకండి. మనం ఏదయినా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు బోజనం లో డైరెక్ట్ గా ప్లేట్ తీసుకుని పెరుగుతో తింటే ఏముంటుంది, మిగిలిన ఐటమ్స్ టేస్ట్ కూడా తెలుసుకోవాలి కదా.  అందుకే చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 
                              గాలులు ఎక్కువగా ఒకే చోట ఉండే చోటును అధిక పీడనం అని తక్కువగా ఉండే ప్రాంతాన్ని అల్పపీడనమనీ అన్ట్టారు. గాలులు నిరంతరం తిరుగుతుండడం వల్ల ఇలా పీడనాల్లో వ్యత్యాసాలు వాతావరణంలో నిరంతరం ఏర్పడుతూనే ఉంటాయి. వేడిగాలులు పైకి లేచిన చోట అల్పపీడనం ఏర్పడితే, ఆ ప్రదేశంలోకి చల్లని గాలులు వేగంగా వచ్చి చేరుతాయి. ఈ గాలుల కదలికల సమయంలో ఒకోసారి సుడులు ఏర్పడతాయి. ఈ సుడుల వల్ల గాలుల మరింత వేగంగా తిరుగుతాయి ఈ ప్రాసెస్ లో చుట్టుపక్కల ఉన్న గాలితో కలిసి వాటి సైజు ను పెంచుకుంటూ వెళ్తాయి. పైకి వెళ్లే గాలులు ఎక్కువగా చల్లబడి పెద్దపెద్ద మేఘాలుగా  ఏర్పడడం జరుగుతుంది. అందువల్లనే అల్పపీడనం ఏర్పడిన ప్రాంతాల్లో వర్షాలు బాగా కురుస్తాయి. అల్పపీడనం ఏర్పడ్డ ప్రాంతాల్లో గాలుల ప్రభావం ఎక్కువైతే, దాన్ని వాయుగుండం అంటారు. అది కూడా బలపడితే తుపాను ఏర్పడుతుంది.
                           అల్పపీడనాలు భూమ్మీద కూడా ఏర్పడవచ్చు. కానీ తుపానులు మాత్రం సముద్రంలోనే ఏర్పడతాయి. ఎందుకంటే అక్కడ గాలులకు కొండలు, భవనాలు వంటి అవరోధాలు ఉండవు. కాబట్టి అడ్డూ అదుపు లేని గాలులు అక్కడ సుడులు తిరుగుతూ కేంద్రీకృతమై పెద్దవిగా మారిపోతాయి. మామూలుగా సూర్యుని కాంతితో సముద్రపు ఉపరితలాలు వేడెక్కడం వల్ల అక్కడ దాదాపు పదికిలోమీటర్ల ఎత్తు వరకు నీటి ఆవిరి పొరలుగా పేర్కొని ఉంటుంది. అల్పపీడనాలు ఏర్పడినపుడు ఈ నీటి ఆవిరి అంతా దానిచుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. ఈ పరిణామం బాగా బలపడితే దానిని హరికేన్‌ అని పిలుస్తారు. హరికేన్‌ ఏర్పడినచోట ఒక్కోసారి సముద్రంలోని నీరు ఎవరో మోటర్ తో పైప్ లోకి లాగినట్టు పైకిలేస్తుంది.  అలా లేచిన అలలు పెద్ద నీటి   గొడుగులాగా 24 అడుగుల ఎత్తు వరకు కూడా లేచి వేగంగా ప్రయాణించి తీరాన్ని ముంచెత్తే అవకాశం ఉంటుంది. దీన్నే ఉప్పెన అంటారు. తుఫాన్ ల గురించి కొంచమయిన క్లారిటీ దొరికింది అనుకుంటున్నా.

                ఈ నాలుగు పాయింట్స్ మీద నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు 2004 కు ముందు తుఫాన్ లను ఏమని పిలిచేవారో ఇంటర్నెట్ లో ఎంత వెతికినా నాకు సరయిన ఆన్సర్ దొరకలేదు. ఈ ఇన్ఫర్మేషన్ ఎలాగయినా తెలుసుకుని మీకు కూడా చెప్పాలి అనే ఉద్దేశంతో India Meteorological Department ఇండియా భారత వాతావరణ శాఖ ఆంధ్రా తెలంగాణా ఆఫీసర్స్ అందరికి కూడా మెయిల్స్ చేయడం జరిగింది. వీరి అందరిలో Cyclone warning center Visakhapatnam వారు  నేను పంపించిన ఈమెయిల్ కు రిప్లై ఇచ్చారు. వారి పంపించిన ఇమెయిల్ ప్రకారం 2004 ముందు  Indian ocean లో వచ్చే ఏ తుఫాను కు కూడా  పేర్లు లేవని , ఎక్కడయితే తుఫానులు తీరన్నాయి దాటుతాయో ఆ ప్లేస్ ను బట్టి  వాటిని పిలిచుకునేవారని, ఉదాహరణకు 1999లో  ఒరిస్సా లో సంబవించిన సైక్లోన్ ను ''1999 ఒరిస్సా సూపర్ సైక్లోన్" అని 1984లో మద్రాస్ లో వచ్చిన తుఫాన్ ను ''1984 Madras Cyclone'' అని   ఇలా వాటి సంవత్సరం ఆధారంగా ప్లేస్ ను బట్టి ఈ సైక్లోన్స్ ను పిలుచుకునేవారట. ఒకే సంవస్చారంలో ఒకే ప్లేస్ లో రెండు లేదా అంతకంటే ఎక్కువ తుఫాన్ లు సంబవిస్తే వాటిని పిలవడం కష్టంగా ఉండేది అని Cyclone warning centre Visakhapatnam వారు తమ ఇమెయిల్ ద్వారా నాకు ఆన్సర్ చేసారు.  

               పైన చెప్పిన విధంగా తుఫాన్లను గుర్తించడానికి కష్టంగా అనిపిస్తున్న కారణంగా , దీనికోసం World Meteorological Organisation / United Nations Economic and Social Commission for Asia and the Pacific సంస్థ లలో సభ్య దేశాలుగా హిందూ మహాసముద్రం పరిదిలో ఉన్న 8 దేసలయిన India, Bangladesh, Maldives, Myanmar, Oman, Pakistan, Sri Lanka, Thailand అన్ని కలిసి 2002లో ఈ సైక్లోన్స్ కు గాను పేర్లను నిర్ణయించాలి ఒక ఒప్పంద్దాన్ని తీసుకువచ్చాయి. 2002 నుంచి 2004 వరకు చర్చలు జరిగిన తరువాత 2004 లో  రాబోయే రోజుల్లో Bay of Bengal,అరేబియన్, Andaman సముద్రాలలో వచ్చే ప్రతీ తుఫానుకు పేర్లు పెట్టాలి అని ఈ దేశాలు అన్ని కలిసి నిర్ణయం తీసుకున్నాయి. 
                         ప్రతీ దేశం కూడా 8 పేర్లను  నిర్ణయించి వాటిని  అనింటిని కూడా ప్యానెల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్ కు పంపించాయి. ఈ దేశాలు అన్ని సలహాలను పంపిన తరువాత, WMO / ESCAP మరియు  ప్యానెల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్ (PTC) ఈ జాబితాను ఖరారు చేసింది. దేశాలు అనింటిని ఇంగ్లీష్  alphabetical ఆర్డర్ లో ఉంచి ఇక్కడ మీరు చూస్తున్న విదంగా ఒక్కొక దేశం నుంచి ఒక్కొక పేరు వచ్చే లా నిర్ణయం తీసుకున్నాయి.

         మొదటి ప్లేస్ లో Bangladesh,రెండవ ప్లేస్ లో India, ఆ తరువాత Maldives, Myanmar, Oman,Pakistan, Sri Lanka, Thailand ఇలా ఒక దాని తరువాత  మరొకటి ఉన్ట్టాయి. September 30, 2004 అరేబియా మహా సముద్రం లో కేంద్రీకృతమైన ఈ తుఫానుకు బంగ్లాదేశ్ నిర్ణయించిన Onil అనే పేరుతో తుఫానులను పేర్లతో పిలిచే సంప్రదాయం మొదలయింది. అపట్లో ఈ ఒనిల్ తుఫాన్ భరత్ పాకిస్తాన్ తీర ప్రాంతాలను అతలాకుతలం చేసింది. ఈ ఒనిల్ ఎఫెక్ట్ వల్ల 9మంది మరణిస్తే 300 మంది కనిపించకుండా పోయారు. ఈ మొత్తం దేశాల తరుపున ఆమోదించిన 64 పేర్లు కూడా 2020 మే నెలలో సంబవించిన Amphan తుఫాను తో పూర్తయ్యాయి. అంటే  2004 నుంచి 2020వరకు మొత్తం 64 మోస్తరునుంచి అతి భారి తుఫానులు వచ్చాయి.
         అక్కడితో ఈ లిస్టు  కంప్లీట్ అయింది. WMO / ESCAP 2018 లో మరో ఐదు దేశాలను ఈ జాబితాలో కలిపింది.  ఆ దేశాలు ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యెమెన్ ఈ టోటల్ 13 దేశాలలో ప్రతీ దేశం నుంచి 13 పేర్లను అందించాలని ఈ  organisations కోరాయి. ఈ సంవస్చారం ఏప్రిల్ నెలలో ఈ 13 దేశాలు అందించిన మొత్తం 169 తుఫాన్ పేర్ల జాబితాను  India Meteorological Department విడుదల చేసింది.

         politics and political figures, religious believes, cultures and gender వీటన్నింటికి కూడా  neutral గాఉండే విధంగా చూసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా జనాభా యొక్క ఏ సమూహ  మనోభావాలకు హాని కలిగించని విధంగా పేరును ఎన్నుకోవాలి. పానెల్ బోర్డ్ కు అందించే పేర్లలో మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ పేర్లు ఏది కూడా మొరటుగా, లేదా క్రూరంగా ఉండకూడదు. చిన్నదిగా ఉండి, పిలవడానికి సులభంగా  మరియు ఏ సభ్యుడికీ offensive గా అంటే అసహ్యం లేదా కోపము పుట్టించే విధంగా ఉండకూడదు.
             ఈ ప్రతీ పేరు లోని అక్షరాలూ ఇంచుమించు 9 అక్షరాలు మించకూడదు. ప్రతిపాదిత పేరును ఆడియో రికార్డ్ చేసి వాటి  pronunciationతో  వాయిస్ ఓవర్‌తో అందించాలి. ఈ tropical cyclones పేర్లు ఒకసారి ఉపయోగించిన తరువాత మరలా రిపీట్ కావు, అందువలన, ప్రతీ పేరు కొత్తగా ఉండాలి. ఇప్పటివరకు ఇండియా మొత్తం 21 తుఫాన్ పేర్లను అందించింది. ఆ లిస్టు మీరు ఇక్కడ చూడొచ్చు.
          agni, akash, bijli, jal, lehar, megh, sagar, vayu, ఈ 8 కూడా మొదటి సారి విడుదల చేసిన జాబితా. Gati, Tej, Murasu, Aag, Vyom, Jhar (pronounced Jhor), Probaho, Neer, Prabhanjan, Ghurni, Ambud, Jaladhi and Vega. ఈ 13 కూడా ఇకనుండి రాబోయే తుఫాన్ పేర్లు. 

                     ఇలా పేర్లు పెట్టడం వల్ల తుఫాన్ లను సులభంగా గుర్తించే అవకాసం  ఉంటుంది అని అధికారులు చెబుతున్నారు. ఈ వర్షాకాల సమయంలో టీవీ లేదా న్యూస్ పేపర్స్ లో వచ్చే ఈ వింత వింత తుఫాన్ పేర్లు ఎలా వస్తాయో తెలిసింది కదా. మరి మీ ఫ్రెండ్స్ మరియు  ఫ్యామిలీ మెంబెర్స్ కి కూడా షేర్ చేసి వాళ్లకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలిసేలా చేయండి.

#Facts
#weather
#cyclones
#cyclonenames
#howcyclonenamesformed
#tropicalcyclones
#interestingfacts



How Tropical Cyclones Are Named | How Cyclones Are Named | అసలు ఈ తుఫాన్ లకు పేర్లు ఎవరు పెడతారు? How Tropical Cyclones Are Named | How Cyclones Are Named |  అసలు ఈ తుఫాన్ లకు పేర్లు ఎవరు పెడతారు? Reviewed by M. Prabhakara Reddy on July 06, 2020 Rating: 5

No comments

If you have any doubts please let me know.

Featured Post

Top 10 Best Wireless Headphones In 2024 | 10 Best budget Wireless Bluetooth Headsets To Buy In 2024

Depending on the device we use, the audio video visuals we see can change in a moment. Video quality depends on larger HDR screens ...

Ads Home

Travel everywhere!