Featured Post

ARTOS Cool Drink | Artos History | Soft Drinks Making | Favorite drink of East Godavari | In Telugu

      కూల్ డ్రింక్ అంటే ఇష్టపడని వారు ఉండరు, ప్రతీ ఒక్కరు ఎదో ఒక సమయంలో వీటిని తాగుతూనే ఉంట్టారు. కూల్ డ్రింక్స్ అంటే జస్ట్ టైం పాస్ కి తాగుతాం లేదా ఏదయినా అకేషన్ లో తాగుతాం. బేసిక్ గా మనం ఫుడ్ కి ఫాన్స్ అయ్యి ఉంట్టాం. కాని కూల్ డ్రింక్ కి ఫ్యాన్ అయ్యి ఉంట్టామా అంటే అది కొంచం తక్కువ అనే చెప్పాలి. ఇప్పుడు మీకు చెప్పబోయే గోదావరి జిల్లా డ్రింక్ ఆ ఆలోచననే మార్చేస్తుంది. ఈ  కూల్ డ్రింక్  ఒక్క గోదావరి జిల్లాల కు మాత్రమే కాదు తెలుగు ప్రజలలో చాల మందికి తెలిసిన ఒక రీజినల్ అంటే లోకల్ సాఫ్ట్ డ్రింక్ ఆర్టొస్. మరీ ముఖ్యంగా ఈస్ట్ గోదావరి ప్రజలకు ఈ ఆర్టొస్ డ్రింక్ తో ఒక ప్రత్యేకమయిన అనుబంధం ఉంది. ప్రస్తుత మార్కెట్ లో వరల్డ్ వైడ్ గా టాప్ ప్లేస్ లో ఉన్న కోకా-కోలా, పెప్సీ వంటి టాప్ బ్రాండ్స్ కు కూడా మంచి పోటీ ఇస్తూ గోదావరి జిల్లా లో మంచి సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ గా ఈ ఆర్టొస్ నిలిచింది అని అనడం లో ఎలాంటి సందేహం లేదు. మరి ఇలాంటి కూల్ డ్రింక్ యొక్క చరిత్రను తెలుసుకోవాలి అంటే వీడియో స్టార్ట్ చేయాల్సిందే. 

  100 సంవస్చారాలకు ముందు మొదలయిన ఈ డ్రింక్ తయారి వెనుక ఒక చరిత్రే ఉంది. ఎక్కడో జపాన్ లో పుట్టిన షోడా, లండన్ లో పెరిగి బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్న టైం లో మనదేశం వచ్చి ఇలా ఈరోజు ఆర్టొస్ అనే బ్రాండ్ గా మారి, ఒక్క ఈస్ట్ వెస్ట్ గోదావరే కాదు రెండు తెలుగు రాష్ట్రాలా ప్రజలకు మరీ ముఖ్యంగా ఆంధ్రా వాసులకు ఫేవరెట్ సాఫ్ట్ డ్రింక్ గా మారిపోయింది. 

   1912లో  అడ్డూరి రామచంద్ర రాజు అనే ఈస్ట్ గోదావరి రామచంద్రాపురం కు చెందిన వ్యక్తి కాకినాడ బ్రిటిష్ కలెక్టర్ ఆఫీస్ లో పాడయి ఉన్న ఒక సోడా మెషిన్ ను చూసి, దానిని పర్చేస్ చేసారు. ఆ మెషిన్ ఎలా పని చేస్తుంది, మరియు దానికి కావలసిన రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అనే ఇన్ఫర్మేషన్ కోసం వైజాగ్ వెళ్ళిన ఆయన అక్కడ ఉండే  ఇంగ్లాండ్ నావి సైలర్స్ తో మాట్లాడి మెషిన్ యొక్క పనితీరు తెలుసుకుని, దానికి కావలసిన స్పేర్ పార్ట్శ్ మరియు సోడా తయరీకు కావలసిన బొట్టేల్స్, CO2 గ్యాస్ వంటి సామగ్రిని కూడా అక్కడ నుంచే తీసుకువచ్చి "Ramachandra Raju soft drinks" అనే పేరుతో సోడా మేకింగ్ స్టార్ట్ చేసారు. 

    1912 ప్రాంతంలో గోలి సోడా గురించి ఈ ప్రాంతంలో వరికీ పెద్దగా అవగాహన లేదు. అందులో నుంచి వచ్చే గ్యాస్ సౌండ్ వల్ల ఇది ప్రమాదమని భావించి రామచంద్రాపురం ప్రజలు ఈ సోడా తాగే ప్రయత్నం చేసేవారు కాదు. కాని ఒకసారి బ్రిటిష్ సోల్డ్జర్స్ ఆ ప్రాంతం నుంచి వెళుతూ ఉండగా గోలి సోడా ను చూసి దానిని తాగడం స్టార్ట్ చేసారు. బ్రిటిష్ సోల్డ్జర్స్ తాగడం చూసిన ఆ ప్రాంత ప్రజలు ఓకే ఇది మంచిదే అని భావించి అప్పటినుంచి ఆ గోలి సోడా ను తాగడం స్టార్ట్ చేసారు. 1912  నుంచి 1919 వరకూ కేవలం గోలి సోడాను మాత్రమే తాయారు చేసేవారు.

    1919 లో రామ చంద్రరాజు  మరియు అతని సోదరుడు జగ్గనాధ రాజు ఇద్దరు కలిసి లోకల్ లైబ్రరీ లో కూల్ డ్రింక్స్ కు సంబందించిన అనేక పుస్తకాలు చదివి, ఆ కంపెనీలకు లెటర్స్ రాసి సాఫ్ట్ డ్రింక్స్ కు కావలసిన రామెటీరియల్స్ లాంటి ఫ్లేవర్స్, బొట్టేల్స్, CO2, అప్పట్లో షుగర్ ఫ్యాక్టరీస్ ఇండియా లో లేకపోవడంలేకపోవడం వల్ల  ఆకరికి షుగర్ ను కూడా విదేశాల నుంచే దిగుమతి చేసుకునే వారు. ఎంత చిన్న కంపెనీ అయిన పెద్ద కంపెనీ అయినా వాటికి ఒడిదుడుకులు తప్పవు, వాటిని అధిగమించి ముందుకు వెళ్ళినప్పుడే ఎటువంటి సంస్థ అయిన అభివృద్దిని చూస్తుంది. ఈ కంపెనీ కు కూడా అలాంటి ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. అదే రెండవ ప్రపంచ యుద్ధం. మేకింగ్ కు కావలసిన రామెటీరియల్స్ వచ్చే షిప్స్ యుద్ధం కారణంగా ఆగిపోవడంతో వాళ్ళకు వచ్చిన నెక్స్ట్ థాట్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉస్ చేయడంకంటే న్యాచురల్ రిసోర్సెస్ ను ఉస్ చేసి వాటిని నుంచి డ్రింక్ కు కావలసిన ఫ్లేవర్స్ ను ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ ఐడియా తో ముందుకువచ్చారు. 

    ఈస్ట్ గోదావరి ప్రాంతంలో రంపచోడవరం మరియు చుట్టుపక్కల అటవీ ప్రాతం నుంచి నారింజ పళ్ళను తీసుకుని వాటినుంచి డ్రింక్స్ కు కావలసిన మెటీరియల్ ను ఎక్స్ట్రాక్ట్ చేసేవారు. సిట్రిక్ ఆసిడ్ కోసం నిమ్మకాయలు, బెల్లం నుంచి వైట్ షుగర్ సొల్యూషన్ చేయడం ఇలా అన్ని కూడా సొంతగానే తయారు చేయడం స్టార్ట్ చేసారు. కాకపోతే వీటికి అయ్యేకర్చు ఎక్కువ ఉండటంతో పెద్దగా ప్రాఫిట్స్ ఉండేవి కాదు. 



      మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తరువాత ఫ్లేవర్డ్ కంపెనీస్, బొట్టిలింగ్ కంపెనీస్, షుగర్ ఫ్యాక్టరీస్ ఇలా అన్ని వచ్చేసరికి బిజినెస్ కూడా పెరగడం స్టార్ట్ అయింది. ఇలా కొంతకాలానికి "Ramachandra Raju soft drinks" అనే పేరును కాస్తా A.R Raju Tonics అని నేమ్ గా చేంజ్ చేసారు. 1950 లో దీనిని 'ARTOS' గా  పేరు మార్చడం జరిగింది. కోకా కోలా వంటి కంపెనీస్ కూడా ఈ ఆర్టొస్ బ్రాండ్ మరియు ఫార్ములా ను కొనడానికి చాలానే ప్రయత్నించారు అని చెబుతారు. 

    ప్రస్తుతం ఈ కంపెనీ నుంచి అనేకరకాల ఫ్లేవర్స్ అందుబాటులో ఉన్నా మెయిన్ గా 'ARTOS' ఒరిజినల్ అంటే గ్రేప్ ఫ్లేవర్డ్  డ్రింక్ 80% ఆర్టొస్ మార్కెట్ ను నిలబెడుతుంది. వీటితోపాటు ఆరంజ్, లెమన్, క్లియర్ లెమన్, జీరా, క్లబ్ సోడా, వాటర్ బొట్టేల్స్ ఇవన్ని కూడా మార్కెట్ లో మిగిలిన 20% సేల్స్ ను కలిగి ఉన్నాయి. పెట్ బొట్టేల్స్ స్టార్ట్ చేయక ముందు కేవలం ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి ఇంకా విశాక లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే సప్లై చేసేవారు. 2016 లో పెట్ బొట్టేల్స్ స్టార్ట్ చేసిన తరువాత విశాక, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణ , గుంటూరు జిల్లా ల వరకు కూడా సప్లై చేస్తున్నారు. హైదరాబాద్ లో కూడా ప్రస్తుతం ఈ డ్రింక్ అందుబాటులో ఉంది.

    మార్కెట్ లో ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీ సాఫ్ట్ డ్రింక్స్ అందుబాటులో ఉన్నా ఈ 'ARTOS' మాత్రం ఇది మన లోకల్ డ్రింక్ అనే మంచి పేరును సంపాదించుకుంది. మీలో ఎవరయినా ఈ 'ARTOS' డ్రింక్ ను టేస్ట్ చేయకపోయి ఉంటె ఛాన్స్ దొరికితే ఒక్కసారయిన ఈ కూల్ డ్రింక్ ను తాగడానికి ట్రై చేయండి. 

జై హింద్

#ARTOSDRINK #makingcooldrinks #cooldrinks Tips Telugu Foods artos drink artos cool drinks drink artos cool drinks arthos coll drink company unknown facts about cool drink manufacture arthos artos drink history artos cool drink india's first cool drink manufacture company successes story of artos drink artos drink history telugu manufacturing artos soft drinks arthos cool drinks facts about artos drink unknown facts about cool drinks soft drinks manufacturing business in telugu myshowmytalks




ARTOS Cool Drink | Artos History | Soft Drinks Making | Favorite drink of East Godavari | In Telugu ARTOS Cool Drink | Artos History | Soft Drinks Making | Favorite drink of East Godavari | In Telugu Reviewed by M. Prabhakara Reddy on February 25, 2022 Rating: 5

No comments

If you have any doubts please let me know.

Featured Post

Top 10 Best Wireless Headphones In 2024 | 10 Best budget Wireless Bluetooth Headsets To Buy In 2024

Depending on the device we use, the audio video visuals we see can change in a moment. Video quality depends on larger HDR screens ...

Ads Home

Travel everywhere!