Featured Post

Top 5 Scams In INDIA Telugu | The Biggest Financial Scams in INDIA | My Show My Talks | Prabhakar

        
ఇండియా ఈక్విటీ మార్కెట్లను కుదిపేసిన భారీ స్కామ్స్, లొసుగులతో నేరగాళ్లు ఇన్వెస్టర్ల సంపదను భారి స్థాయిలో దోచుకున్న అతి  పెద్ద స్కామ్స్, ఇల్లీగల్​ ఇన్వెస్ట్​మెంట్లతో వేల కోట్ల మోసాలు, షేర్ల ధరల రిగ్గింగ్, కంపెనీ అకౌంట్స్ తారుమారు. ఇటువంటి స్కామ్స్ తరచు ఎదో ఒక చోట జరుగుతూనే ఉన్ట్టాయి. ఆటువంటి వాటిలో టాప్ 5 స్కామ్స్ మరియు వాళ్ళు మన దేశ ప్రజల దగ్గరనుంచి మరియు బడా బడా బ్యాంక్స్ నుంచి కూడా వెళ్ళు వేల కోట్ల రూపాయలను ఏ విధంగా కాజేసారో ఈ వీడియో లో తెలుసుకుందాం. 

మీరు కనుక ఈ స్టాక్స్ లో మోసపోకుండా మీ తెలివితేటలతో మార్కెట్ ను అంచనా వేసి మనీ సంపాదించాలి అనుకుంటే ది బెస్ట్ ట్రేడింగ్ app Upstox. ఎప్పటికప్పుడు up to date ఉంటూ, యూసర్ ఫ్రెండ్లీ గా ఉండే ఈ Upstox money earning కు చాల మంచి ప్లాట్ ఫార్మ్. ఈ  లింక్ మీద క్లిక్ చేసి upstoxలో ఒక  అకౌంట్ create చేసుకోండి. ఇక టాపిక్ లోకి వెళితే. 

     స్టాక్  మార్కెట్లలో  ఇన్వెస్టర్ల మనీని కాపాడేందుకు, మార్కెట్లలో సురక్షితమైన వాతావరణాన్ని create చేసేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ అఫ్ ఇండియా SEBI ఎప్పటికప్పుడు పలు రూల్స్ ను తీసుకోస్తూనే ఉంటుంది. మార్కెట్లను రెగ్యులేట్ చేస్తూ మోసాలకు అవకాశాలు లేకుండా తనవంతు ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ మోసగాళ్ళు ఏ చిన్న ఛాన్స్ దొరికినా, దానిని ఆధారం చేసుకుని భారీ స్కామ్ లు చేస్తున్నే ఉన్నారు. ఇలా సిస్టం లో ఉన్న లొసుగులను వాడుకుని ఆర్ధిక నేరాలకు పాల్పడిన వారిలో ఒక ఐదుగురు మాత్రం ఎప్పటికి గుర్తుండిపోతారు. వీలు చేసిన స్కామ్ లు ఇండియన్ చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోతాయి. ఆ టాప్ స్కామ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

              

కేతన్ పరేఖ్ స్కామ్ 


     కేతన్ పరేఖ్ ఒక చార్టెడ్ accountant. హర్షద్ మెహతా సంస్థ గ్రోమోర్ investments లో పనిచేసేవాడు. మెహతా వారసుడిగా కేతన్ కు పేరుంది. షేర్ల రిగ్గింగ్ లో మెహతా టెక్నిక్స్ నే కేతన్ పరేఖ్ కూడా అవలంబించేవాడు. షేర్ ప్రైస్ ను రిగ్ చేస్తూ Indian stock market manipulation కు తెర తీసాడు కేతన్ పరేఖ్. ఉదాహరణకు  Zee telefilms షేర్ ప్రైస్ 127 రూపాయల దగ్గర నుంచి అమాంతంగా 10,వేల వరకు జూమ్ అయ్యాయి. ఇతడు కూడా బ్యాంక్ లు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనీ తీసుకువచ్చి , వాటిని ఇల్లీగల్ స్టాక్స్ లో పెట్టుబడిగా పెట్టేవాడు. అలా ఆ స్టాక్స్ ధరలు అమాంతం పెరిగేలా చేసేవాడు. కే-10 స్టాక్స్ లో కేతన్ పరేఖ్ ఇన్వెస్ట్ చేశాడు. వాటిలో అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్ లిమిటెడ్, Himachal Futuristic Communications,ముక్తా ఆర్ట్స్, టిప్స్, ప్రితీష్  నంది కమ్యూనికేషన్స్, జీటీఎల్, జీ టెలి ఫిలిమ్స్, పెంటామీడియా గ్రాఫిక్స్, క్రెస్ట్ కమ్యూనికేషన్స్, ఆప్టెక్ ఇన్ఫోసిస్ ఉన్నాయి. ఈ  k-10 స్టాక్స్ ఒక్కసారిగా బేర్స్ ను తాకడంతో రిటైల్ ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు వచ్చాయి.

      ఈ కేతన్ పరేఖ్ స్కామ్ 2001 లో సెన్సెక్స్ 176 పాయింట్లు పడిపోవడంతో వెలుగులోకి వచ్చింది. అప్పుడు జరిగినా ఆ ఇన్వెస్టిగేషన్ లో ఈ స్కాం యొక్క వివరాలు బయటపడ్డాయి. ఈ విషయం బయటకు రాగానే కేతన్ పరేఖ్ తను కొన్న షేర్లు అన్నింటిని అమ్మి.. మార్కెట్ క్రాష్ అయ్యేలా చేశాడు. 

సత్యం స్కాం


         2009 లో అతిపెద్ద కార్పొరేట్ స్కాం ఇది. సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ లిమిటెడ్ ( SCSL) చైర్మన్, మరియు ఇతర సీనియర్ మెంబెర్స్ కూడా సెబి వద్ద తమ తప్పును ఒప్పుకున్నారు. 2003 నుంచి 2008 మధ్య కంపెనీ అకౌంట్లను తారుమారు చేసి సేల్స్, మరియు ప్రాఫిట్స్ పెరిగినట్లు తప్పుడు లెక్కలు చూపించినట్లు చెప్పారు. ఈ మోసం విలువ 7 వేల కోట్లు. central bureau of investigation { CBI } ఈ కంపెనీ కి చెందిన అనేక అకౌంట్ లను ఫ్రీజ్ చేసి, వారిపై సంబందిత ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. ఈ స్కాం లో ఇన్వొల్వె అయిన చైర్మన్, ఇతర సీనియర్ మెంబెర్స్
అందరు కూడా జైలుకు వెళ్ళారు. సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ ను మహీంద్ర గ్రూప్ టేక్ ఓవర్ చేసింది. ఆ తరువాత దీని పేరును మహీంద్ర సత్యంగా మార్చింది. 

నీరవ్ మోడీ స్కాం


      బ్యాంకింగ్ ఇండస్ట్రీ లో నీరవ్ మోడీ స్కాం పెద్ద సంచలనం.  PNB కి 11,300 కోట్లు కన్నం వేసాడు ఈ జ్వేయుల్లెర్. ముంబై లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తప్పుడు విధానం లో LOU లు అంటే  లెటర్స్ అఫ్ undertaking తీసుకుని, వాటి ద్వారాఇండియన్ లెండర్ల నుంచి విదేశాల్లో అప్పులు తీసుకున్నాడు. వీటిలో అనాదికార లావాదేవీలు గుర్తించినట్టు PNB 2018 లో సెబి, మరియు సిబిఐ కి రిపోర్ట్ చేసింది. ఈ fraud వెలుగులోకి రాగానే PNB షేర్లు దివాలా తీశాయి. ఈ స్కాం లో భాగమయిన నీరవ్ మోడీ ని, అతడి మేనమామ గీతాంజలి జెమ్స్  CMD మొహల్ ఛోక్సీని అరెస్ట్ చేద్దాం అనుకునే లోపే వాళ్ళు దేశం విడిచి పారిపోయారు. ఇప్పటికీ ఈ కేసు నడుస్తూనే ఉంది. 2019 మార్చ్ నెలలో  London లో నీరవ్ మోడీ ని అక్కడి పోలీస్ లు అరెస్ట్ చేసారు. 

హర్షద్ మెహతా స్కాం


      ఇప్పటివరకు ఇండియన్ స్టాక్ మార్కెట్ లో చోటు చేసుకున్న అతి పెద్ద స్కాం లలో ఇదీ ఒకటి. సెక్యూరిటీ స్కాం గా పిలువబడే ఈ స్కాం విలువ 7500 కోట్లు. హర్షద్ మెహతా ఒక స్టాక్ బ్రోకర్. మెహతా కొన్ని బ్యాంకుల నుంచి నకిలీ రసీదుల ద్వారా, మరి కొన్ని బ్యాంకు ల నుంచి అప్పుల రూపంలో డబ్బులు సేకరించి ఆ కాష్ మొతాన్ని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవాడు. దీనితో మార్కెట్లు విపరీతంగా పెరిగేవి. దీనితో హర్షద్ ను చాల మంది ఫాలో అయ్యేవారు. అతడు కొన్న స్టాక్స్ లోనే ఇన్వెస్ట్ కూడా చేసేవారు. స్టాక్ లు గరిస్టాలకు చేరాక ఆ స్టాక్ లను భారీ లాబాల వద్ద  అమ్మేసి స్టాక్ ధరను సడన్గా పడిపోయేలా చేసేవాడు. అయితే ఆయా బ్యాంకు వద్ద లోన్ తేసుకునేటప్పుడు  అతడు హామీగా ఉంచిన పత్రాలన్నీ నకిలీవి మరియు ఏ మాత్రం విలువ లేనివి. 
         ఇతడు బ్యాంకు ల డబ్బును ఏప్రిల్ 1991 నుండి మే 1992 మధ్యలో బొంబై స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ స్టాక్స్ లో ఇల్లీగల్ గా ఇన్వెస్ట్ చేశాడు. దీంతో BSE సెన్సెక్స్ 1194 పాయింట్ల నుంచి ఏకంగా 4500 పాయింట్ల వరకు  పెరిగి, 274 శాతం రిటర్న్స్ పొందింది. మార్కెట్లు కంటిన్యూ కొత్త గరిష్టాలను  తాకుతుండటంతొ Harshad Mehta ను అందరు బిగ్ బుల్ అంటూ ప్రసంసిన్చేవారు. అతడు ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే వాటిని విపరీతంగా కోనేసేవారు. 1992 ఆగష్టు లో స్టేట్ బ్యాంకు ప్రభుత్వ సెక్యూరిటీస్ లో 3500 కోట్ల లోటును పసిగట్టింది. దీంతో స్కాం బయటపడింది. 

      హర్షద్ మెహత స్టొరీ గురించి మర్రిని వివరాలు తెలుసుకోవాలి అంటే Scam 1992 అనే పేరుతో సోనీ లో ఒక web series కూడా రిలీజ్ అయింది. బయట ప్రపంచానికి తెలియని ఎన్నో కదలు మరెన్నో కుట్రలు ఈ web series లో చూపించారు. 

నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ NSEL స్కాం


          NSEL అనేది కమోడిటీస్ ఎక్స్చేంజ్ . ఇది అగ్రికల్చర్ , industrial కమోడిటీస్ లో ట్రేడింగ్ కు అనుమతిస్తుంది. ఈ ఎక్స్చేంజ్ ఫౌండర్ జిగ్నేష్ షా. స్టాక్ ఎక్స్చేంజ్ మాదిరిగా ఈ కమోడిటీస్ ఎక్స్చేంజ్ లోను బయర్, సెల్లర్ ఒకరికి ఒకరు తెలియరు. ఒకసారి ట్రేడ్  ఎగ్జిక్యుట్ అయ్యాక కమోడిటీస్ బయర్ కు డెలివరీ అవుతుంది. ఈ NSEL పలువురు రిటైల్ ఇన్వెస్టర్లకు ఎంతో ఆకర్షనీయంగా మారింది. వారి ఇంవేస్త్మేంట్ల పై మంచి రిటర్న్లు రావడంతో చాలామంది దీనికి ఆకర్షితులయ్యారు. పేయిర్డ్ కాంట్రాక్ట్ లపై ఫిక్సిడ్ రిటర్న్స్ పొందేవారు. పేయిర్డ్ కాంట్రాక్ట్ ల ద్వారా వచ్చే మనీ అంతా ఎక్స్చేంజ్ లోనే ఉండిపోయేది. దీంతో ఈ స్కాం కి తెరలేచింది. ఈ విషయం తెలుసుకున్న ఫార్వడ్ మార్కెట్ కమిషన్ NSEL కు కొత్త ఆర్డర్లు రాకుండా ఆపేసింది. అప్పటివరకు ఇన్వెస్ట్ చేసిన వారికి NSEL చెల్లింపులు చేయక తప్పలేదు. అల చెల్లింపులు చేస్తూ ఉండటంతో NSEL దివాలా తీసింది. 

     ఇవే కాదు ఇలాంటి మరెన్నో చిన్నా చితకా  స్కామ్స్ మన దేశం లో తరచు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మీరు చూసిన ఈ టాప్ 5 స్కామ్స్ షేర్లకు మరియు కంపెనీ లకు సంబందించినవి ఇలాంటి మరికొన్ని స్కామ్స్ గురించి తెలుసుకోవాలి అంటే కింద కామెంట్స్ లో జస్ట్ yes అని Comment చేయండి. మరొక ఇంటరెస్టింగ్ టాపిక్ తో మరొక వీడియో లో మల్లి కలుద్దాం. ఈలోపు మన ఛానల్ ను కాని మీరు ఇంకా సబ్స్క్రయిబ్ చేసుకోక పోతే తప్పకుండ సబ్స్క్రయిబ్  చేసుకుని ఈ వీడియో ను లైక్ చేయండి. థాంక్స్ ఫర్ watching జై హింద్.





Top 5 Scams In INDIA Telugu | The Biggest Financial Scams in INDIA | My Show My Talks | Prabhakar Top 5 Scams In INDIA Telugu | The Biggest Financial Scams in INDIA | My Show My Talks | Prabhakar Reviewed by M. Prabhakara Reddy on February 03, 2021 Rating: 5

No comments

If you have any doubts please let me know.

Featured Post

Earn Passive Income for Life with EarnKaro’s Refer & Earn Program! (10% Lifetime Commission)

EarnKaro Refer & Earn - 10% Lifetime Commission Earn Passive Income for Life with EarnKaro ...

Ads Home

Travel everywhere!