Featured Post

Ramji Gond The First Freedom Fighter | The Real Freedom Fighter Of INDIA | A Real Hero | Ramji Gondu

 రాంజీగోండ్‌...

 యురోపియన్ మరియు బ్రిటిషర్స్ భారతదేశంలోకి ప్రవేశించినప్పటి నుండి, భారతీయులు అనేకరకాలుగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వాటిలో ముఖ్యంగా అధిక పన్నుల వసూళ్లు, మతమార్పిడిలు, దేశ సంపద దోచుకోవడంలాంటి మరెన్నో దారుణాలు చేస్తూనే వచ్చారు. ఈ దురాగతాలకు వ్యతిరేకంగా దేశంలో ఎన్నో పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. లక్షల కొద్ది వీరులు ఈ పోరాటాల్లో పాల్గొని ప్రాణాలు వదులుతూ పోరాడుతూనే ఉన్నారు. అటువంటి గొప్ప స్వాతంత్ర్య సమరయోధులను మనం చదువుకున్న పాఠ్య పుస్తకాలలో ఉన్న వారిని చేతి వేళ్ల మీద లెక్కించొచ్చు. కాని మన దేశ చరిత్ర పుస్తకాలు మరుగున పాడేసిన గొప్ప గొప్ప వీరులు ఇప్పటికి కనీస గుర్తింపుకు నోచుకోని మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో చాలా మందే ఉన్నారు.

    భారత ప్రథమ స్వాతంత్య్ర పోరాటం అంటేనే సహజంగా ప్రతీ ఒక్కరికి ముందుగా గుర్తు వచ్చేది  1857 సిపాయిల తిరుగుబాటు. ఆ పోరులో తెలంగాణ నేల కూడా భాగమైంది. అందులోనూ నిర్మల్‌ ప్రాంతం ప్రముఖంగా నిలిచింది. ఇక్కడ జరిగిన ఓ దారుణ సంఘటన చరిత్రపుటల్లో ఎక్కడా లేకపోవడం దురదృష్టకరం. వెయ్యిమంది వీరులను నిర్మల్‌లో ఒకే మర్రిచెట్టుకు ఉరితీయడం దేశ చరిత్రలోనే ఎక్కడా జరగని ఓ అతిపెద్ద ఘటన. అలాంటి వీరుడైన రాంజీగోండ్‌ తో సహా ఆ వెయ్యిమందికి ఇప్పటికీ గుర్తింపు లేదు. వెయ్యిమందిని ఒకే మర్రిచెట్టుకు ఉరితీయడం ఎక్కడ కనీ విని ఎరుగనిది. ఇటువంటి ఒక దారుణం మన తెలుగు గడ్డమీద జరిగింది అని తెలిసిన తరువాత ఈ వీడియో చేయకుండా ఉండలేకపోయాను. 

1836–60 కాలంలో మధ్య భారతదేశంలో గోండ్వానా ప్రాంతంలో భాగమైన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీలకు మర్సికోల్ల రాంజీగోండు నాయకత్వం వహించేవాడు. మహారాష్ట్ర, ఒడిశా, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో నివసించే అనేకమంది గిరిజన తెగల సమూహాలతో గోండ్వానా రాజ్యం ఉండేది. ఇది బ్రిటిష్‌ పాలకులు రాక పూర్వమే ఏర్పడింది. గోండుల పాలన సా.శ. 1240–1750 వరకు సుమారు 500 సంవత్సరాలు పాటు కొనసాగింది. 9మంది గోండురాజులలో చివరివాడైన నీల్‌కంఠ్‌షా (సా.శ. 1735– 49) ని మరాఠీలు బంధించి చంద్రాపూర్‌ను ఆక్రమించుకున్నారు. అక్కడితో గోండ్వానా ప్రాంతం మరాఠీల ఆధీనమైంది. అనంతర కాలంలో ఈ ప్రాంతాన్ని అంతటిని ఆంగ్లేయులు దక్కించుకున్నారు. అప్పటి నుంచి గోండుల, మరాఠీ పాలన అంతమై, ఆంగ్లేయులు, హైదరాబాద్‌ నైజాం పాలన ఆరంభమైంది. వీరి ఇద్దరి దౌర్జన్యాలు ఊర్లను దాటి అడవుల్లోకి చొచ్చుకువచ్చాయి.

  అడవులలో ప్రశాంతంగా జీవించే గిరి పుత్రులను నిజాం మరియు ఆంగ్లేయులు వదిలిపెట్టలేదు. వారి దురాక్రమణలు అడ్డుకోవడంతో  మొదలయిన రాంజీ గోండ్ ప్రస్తానం అతి తక్కువ కాలంలోనే అతడిని గొరిల్లా యుద్ధ పోరాట వీరుడిగా మార్చింది. 1836–1860 మధ్యకాలంలో నాటి జనగాం కేంద్రంగా చేసుకుని రాంజీగోండు బ్రిటిష్‌ సైన్యాలను దీటుగా ఎదుర్కొనేవాడు. నిర్మల్, ఉట్నూర్, చెన్నూరు, ఆసిఫాబాద్ ప్రాంతాలకు రాంజీనే నాయకత్వం వహించ్చేవాడు. ఆంగ్లేయులను ఎదుర్కొన్న తొలి గిరిజన పోరాట యోధుడు కూడా రాంజీనే. అదేసమయంలో ఉత్తర భారతదేశంలో ప్రథమ స్వతంత్ర సంగ్రామం ఉవ్వెత్తున ఎగిసింది. బ్రిటిష్‌ సైన్యంతో ఝాన్సీ లక్ష్మిబాయి, నానాసాహెబ్, తాంతియాతోపే, రావు సాహెబ్‌లు పోరాడారు. అయితే ఆంగ్లేయుల బలగాల ముందు వారు నిలువలేక తలోదిక్కు తమ బలగాలతో విడిపోయారు. తాంతియాతోపే అనుచరులైన రోహిల్లాలు (రోహిల్‌ఖండ్‌ ప్రాంతానికి చెందినవారు) పెద్దసంఖ్యలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీదర్, పర్బనీ, తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోకి వచ్చి తలదాచుకున్నారు. అప్పట్లో వీరు మహారాష్ట్రలోని అజంతా, బస్మత్, లాతూర్, మఖ్తల్, తెలంగాణలోని నిర్మల్‌ తాలూకాలను పోరాట కేంద్రాలుగా చేసుకున్నారు. అదే సమయంలో నిర్మల్‌ తాలూకాలో ఉంటున్న ఆంగ్లేయ కలెక్టర్, మరియు అక్కడి తాలూక్‌దార్‌ ఆగడాలు పెరిగిపోవడంతో రాంజీగోండు ఈప్రాంతంపై దృష్టిపెట్టాడు. తన గిరిసైన్యానికి, రోహిల్లా దండు తోడైంది. వారంతా రాంజీ సారథ్యంలో తిరుగుబాటు లేవదీశారు.

రాంజీ నాయకత్వంలో వెయ్యిమంది రోహిల్లాలు, గోండులు కలిసి నిర్మల్‌ సమీపంలోని అడవులు, కొండలు, చెరువులను ఆధారంగా  చేసుకుని బ్రిటిష్, నైజాం పాలకులను ముప్పతిప్పలు పెట్టారు. నిర్మల్‌ కలెక్టర్‌ హైదరాబాద్‌లోని రెసిడెంట్‌కు సమాచారం ఇచ్చాడు. అతడి ఆదేశాల మేరకు కర్ణాటక ప్రాంతంలోని బల్లారిలో గల స్వదేశీదళం కల్నల్‌ రాబర్ట్‌ ఆధ్వర్యంలో నిర్మల్‌ ప్రాంతానికి చేరుకుంది. వారు ఆధునిక ఆయుధాలతో వచ్చినా రెండుసార్లు ఆదివాసీ వీరులు ఇక్కడి భౌగోళిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని ఓడించారు. ఈప్రాంతంలో వీరిని ఓడించడం కష్టమని ఆనాటి పాలకులు దొంగదెబ్బతీసి, గోదావరినది సమీపంలోని సోన్‌ ప్రాంతంలో రాంజీగోండుతో సహా వెయ్యిమందిని పట్టుకున్నారు. వారందరినీ ఈడ్చుకుంటూ తీసుకువచ్చి, నిర్మల్‌ శివారులో ఉన్న ఊడలదిగిన మహా మర్రిచెట్టుకు ఉరితీశారు. ఈఘటన 1860 ఏప్రిల్‌ 9న జరిగినట్లు చెబుతారు. అలా.. వెయ్యిమందిని ఉరితీసినందునే ఆ మర్రిచెట్టు వెయ్యిఉరుల మర్రిగా పేరొందింది. ఆచెట్టు 1995లో గాలివానకు నేలకొరిగింది. కొన్ని దశాబ్దాలుగా రాంజీగోండ్‌ పోరాటాన్ని, వెయ్యిమంది అమరుల త్యాగాల్ని ఏ పాలకుడూ గుర్తించలేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో పలు సంఘాల నాయకులు కలిసి నిర్మల్‌ పట్టణంలో చైన్‌గేట్‌ వద్ద రాంజీగోండు విగ్రహం, వెయ్యిఉరుల మర్రి సమీపంలో ఓ అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు. గతంలో నిర్మల్‌లో రాంజీగోండు పేరిట మ్యూజియం, అమరుల స్మారకార్థం ఓ అమరధామం నిర్మిస్తామని చెప్పినా.. అమలుకు నోచుకోలేదు. 2021 సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా నిర్మల్‌ వచ్చారు. ఇక్కడి రాంజీగోండు సహా వెయ్యిమంది అమరులకు నివాళులర్పించారు. దీంతో రాంజీసహా వెయ్యిమంది అమరుల ప్రాణత్యాగాల చరిత్ర ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కానీ.. ఇప్పటికీ వారి స్మారకార్థం ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. చరిత్ర పుటల్లో, పాఠ్యపుస్తకాల్లో ఎక్కడా.. వారికి చోటివ్వకపోవడం శోచనీయం.

 రాంజీ గోండ్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడం కోసం చాలా ట్రై చేసాను. కనీసం ఆయన డేట్ అఫ్ బర్త్ కూడా ఎలాంటి రికార్డ్స్ లోను మెన్షన్ చేయలేదు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో కూడా ఎలాంటి బుక్స్ నాకు దొరకలేదు. అందుకనే ఈ వీడియోను అసంపూర్తిగా వదిలేయాల్సి వచ్చింది. ఎవరో పక్క రాష్ట్రాల వారికి జోహార్లు కొడతారు కాని! ఈరోజు మనం తిరుగుతున్న ఈ నేల మీద రక్తం చిందించి, ప్రాణాలు అర్పించిన ఇటువంటి వీరుల కధలను మన స్కూల్ బుక్స్ లో ప్రింట్ చేస్తే కొంచం అయిన తరువాతి తరాలకు తెలియచేసినవాళ్ళం అవుతాము. ఇలానే వదిలేస్తే ఇదిగో ఇలా ఆన్లైన్ లో వీడియోస్ చూసి తెలుసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి లో ఉన్నాం. 

ఇటువంటి గొప్ప గొప్ప వీరులు మీ ప్రాంతాలలో కూడా ఉండే ఉంట్టారు. ఒక వేల అలాంటివారే కనుక ఉంటె వారి పేరును కింద కామెంట్ లో రాయండి. 

 చూసి వదిలేయకుండా మీరుకూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కు షేర్ చేస్తారు అని ఆశిస్తున్నాను. లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.

ramji gond, ramji gond history in telugu, ramji gond biography, ramji gond real story, forgotten hero ramji gond, unknown facts about ramji gond, telangana hero - ramji gondu, how ramji gond fought with nizam king, how ramji gond fought with britishers, telangana history in telugu, gond, gond tribe, indian freedom struggle telugu, telugu freedom fighters of india, telangana hero, telugu real stories, telugu tribal leaders, unknown facts telugu, myshowmytalks teluguvideos august 15 agst15 #Ramjigond #indianfreedomfighter #firstfreedomfighter




Ramji Gond The First Freedom Fighter | The Real Freedom Fighter Of INDIA | A Real Hero | Ramji Gondu Ramji Gond The First Freedom Fighter | The Real Freedom Fighter Of INDIA | A Real Hero | Ramji Gondu Reviewed by M. Prabhakara Reddy on August 19, 2022 Rating: 5

No comments

If you have any doubts please let me know.

Featured Post

SASA LELE SALE IS LIVE! Grab Up to 85% Off on Smartphones, TVs, Laptops & More!

SASA LELE SALE IS LIVE! Up to 85% Off on Smartphones, TVs, Laptops & More! 🚀 S...

Ads Home

Travel everywhere!