Featured Post

Military Madhavaram | Special Story on Military Madhavaram Village | Indian Army

       
               దేశ బక్తికి మారు పేరు ఆ గ్రామం. అక్కడ పుట్టిన ప్రతి బిడ్డ సైన్యం లో చేరాలని దేశ సేవ కోసం తహతహలాడుతున్ట్టారు. స్వాతంత్ర్యం రాకముందు నుంచి నేటి వరకు ఏ యుద్ధం జరిగిన కూడా ఆ గ్రామస్తులు పాల్గోనల్సిందే. దేశం లో ఒక్క ఢిల్లీ తరువాత మరెక్కడా లేని వార్ మెమోరియల్ ఆ ఒక్క గ్రామానికే సొంతం. దేశం కోసం ప్రాణాలు అర్పించే పౌరుషం ఆ పల్లె ప్రతి పౌరునిలో కనిపిస్తుంది. దేశ రక్షణకోసం వందాలాది మందిని సైనికులుగా పంపి ఆ గడ్డ పునీతమయింది. ఆ ఊరి గొప్పతనం గుర్తించి కేంద్రం 11 కోట్ల రూపాయలని గ్రామ అభివృధికి విడుదల చేసింది అంటే అక్కడి ప్రజల దేశ భక్తి గురించి పేరు పేరున చెప్పాల్సిన అవసరం లేదు. 

                                       
  ఆ ఊరి పేరే మిలటరీ మాధవరం. ఆంధ్ర ప్రదేశ్ లోని వెస్ట్ గోదావరికి జిల్లా  తాడేపల్లి గూడెం మడలంలో ఉన్న ఈ మిలటరీ మాధవరం చరిత్ర ఇప్పటిది కాదు. దాదాపు ఇప్పటికి 950 సంవస్చారాల క్రితం రాజమండ్రి లేదా రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజ రాజ నరేంద్రుడు కాలంలో తమ సామంతరాజులయిన గజపతి భ్రమ్మ వర్మ మాధవ భ్రమ్మ వర్మ అనే వారు ఆరుగొలను కోటను కట్టారు,  ఆ కోటకు  దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో మాధవరం అనే గ్రామాన్ని సైనికుల శిక్షణ కోసం నిర్మించారని రికార్డెడ్ ప్రూఫ్స్ చెబుతున్నాయి. కాలక్రమంలో ఈ కోట సిదులాలుగా మారి కనుమరుగయినప్పటికి, ఆనాడు స్థాపించిన ఈ  సైనిక శిక్షణ శిబిరాలు అప్పటి ఆరుగొలను రాజులకు మాత్రమే వారి సేవలను అంకితం చేసిన మాధవరానికి చెందిన యుద్ద వీరులు ఆతరువాత వాళ్ళను పాలించిన సంస్థానంలో సైనికులుగా చేరి వారి వీరత్వాని నిరూపించుకున్నారు. 

                                       
      ఎదో తెలుగు సినిమాలో చూసినట్టు, పాలించే ప్రభువులకు నమ్మిన బంటులా, వారివెంటనే  ఉంటూ తర తరాలుగా ఈ మాధవరం వారి సేవలు అందిస్తూనే వస్తుంది. రాజుల సంస్థానాలు అంతరించిపోయిన, బ్రిటిష్ పరిపాలన ముగిసిపోయిన తరువాత కూడా ఇప్పటికి వీళ్ళు ఇండియన్ ఆర్మీ లోనే కొనసాగుతున్నారు. దేశం లో ఎక్కడ యుద్ధం జరిగిన కూడా ఆ యుద్ధ భూమిలో పోరాడుతూ ఈ మిలటరీ మాధవరం ఊరి ప్రజలు ఉంట్టారు అంటేనే అర్ధమయిపోతుంది కదా. అందుకనే ఈ ఊరిని మాధవరం అని కాకుండా మిలటరీ మాధవరం అని పిలుస్తారు. 

    మొదటి ప్రపంచ యుద్ధం లో మాధవరం గ్రామస్తులు 90మంది పాల్గొన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం లో పదకుండు వందల మంది పాల్గొన్నారు. ఈ రెండు ప్రపంచ యుద్దాలలోను 15 మంది వీర మరణం పొందారు.. కార్గిల్ యుద్ధం, ఇండో చైనా వార్, ముంబై లో ఉగ్రవాదుల దాడి, పంజాబ్ బ్లూ స్టార్ ఆపరేషన్, సిర్జికల్ స్ట్రైక్, శ్రీలంక శాంతి సేన యుద్దాలలో ఈ గ్రామానికి చెందిన వారు ఎంతో మందోది  పాల్గొన్నారు.  
   
Military Madhavaram | Special Story On The Military Madhavaram Village | Indian Army | Telugu Video,my show my talks,military madhavaram village,military madhavaram videos,military madhavaram,madhavaram village,indian army villages,history of military madhavaram,indian army top,top indian army,indian navy forces,army training videos,indian triforces,great india,india is great,bhavaji palem,bhavaji palem indian army,bavaji palem village,arugolanu fort,forts

     ఒకే కుటుంబం నుంచి ముగ్గురు లేదా నలుగురు కూడా ఆర్మీలో  ఉన్న కుటుంబాలు ఇక్కడ చాలా ఉన్నాయి. దాదాపు 5 తరాలుగా తాతముతాతలు, తండ్రికొడుకులు, అన్నా తమ్ములు, ఇలా వంశ పారపర్యంగా సైనికులుగా పనిచేస్తూ ఉన్నవాళ్లు  కూడా ఉన్నారు. మన ఇప్పటి రోజులూ ను ఫ్యూచర్ లో ఏమం అవుతావ్ అని ఎవరినయిన అడిగితే డాక్టర్, ఇంజనీర్, ఆక్టర్, బిజినెస్ మాన్ అంటూ చెబుతూ ఉంట్టాం. కాని మాధవరం లో పుట్టిన వాలు మాత్రం ఆర్మీ లోనే జాయిన్ అవుతాం అంటూ చెబుతారు. దానికోసం స్కూల్ లో ఉన్నపటినుంచే రన్నింగ్, లాంగ్ జంప్ అంటూ ఫ్యూచర్ కోసం తమను తాము రెడీ చేసుకున్ట్టారు. 

     ఒక వేల నిజంగా ఆర్మీ లో సెలెక్ట్ అవ్వకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ లేదా నేవీ ఇలా ఎదో ఒక దాంట్లో జాయిన్ అయ్యి దేశానికి ప్రజలకు వాళ్ళ సేవలను అందిస్తారు. ఒక వేల దురదృష్టవ సాత్తు ఎందులోనూ పోస్టింగ్ రాకపోతే అదే ఊరిలో ఉంటూ రైతు గానో లేదో వేరే ఎదో ఒక పని చేసుకున్ట్టారు తప్ప ఊరిని విడిచి వెళ్లారు. ఇప్పటి అంచనా  ప్రకారం సుమారుగా నాలుగు వేల నుంచి 5 వేల మంది వరకు  వాళ్ళ సేవలను అందించడానికి ఇండియన్ ఆర్మీ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆర్మీ లో ఉండి దేశానికి సేవ చేస్తున్న వాళ్ళే సుమారుగా1000 కి పైన ఉన్నారు.


       ఆర్మీ లో ఉండే ప్రతి యూనిట్ లోను ఒకరో ఇద్దరో కచ్చితంగా ఈ ఊరి నుంచి ఉంట్టారు అని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు. బ్రిటిష్ ప్రబుత్వం 1933 లోనే మాధవరం గ్రామం లో మిలిటరీ సెలక్షన్ కోసం ఒక ఆఫీస్ ను కూడా ఏర్పాటు చేసింది అంటే దాని బట్టి ఈ గ్రామ వాసులకు ఆర్మీ లో చేరాలన్న తపన ఎంతలా ఉంది అనేది అర్ధమవుతుంది, ఇప్పటి రోజులూ ఆ ఆఫీస్ బిల్డింగ్ ను లైబ్రరీ లా ఉపయోగిస్తున్నారు. మొదటి రెండవ ప్రపంచ యుద్దాలలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల గౌరవార్ధం ఈ గ్రామం లో స్థూపాన్ని కూడా నిర్మించారు.  ఇలా తమవారంత దేశం కోసం చేసిన సేవలు వారు సాదించిన పతకాలనే స్పూర్తిగా తీసుకుని తరువాతి తరం వారు కూడా వాళ్ళ పెద్దవాలు వేసిన అడుగులలోనే వెళ్తూ దీనిని జీవితం లో సాదించాల్సిన 

Military Madhavaram | Special Story On The Military Madhavaram Village | Indian Army | Telugu Video,my show my talks,military madhavaram village,military madhavaram videos,military madhavaram,madhavaram village,indian army villages,history of military madhavaram,indian army top,top indian army,indian navy forces,army training videos,indian triforces,great india,india is great,bhavaji palem,bhavaji palem indian army,bavaji palem village,arugolanu fort,forts


   ఒక లక్ష్యంగా ముందుకు వెళ్తారు. ఆర్మీ లో కేవలం ఒక్క ఝావాన్ ల గానే కాదు కెప్టన్లుగా, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్  ర్యాంక్ లలోను ఇక్కడి వారు పని చేసారు. ఇలా దేశానికి ప్రత్యక్షంగాను పరోక్షం గాను సేవలందిస్తున్న ఊరు ఈ మాధవరం కాదు కాదు మిలిటరీ మాధవరం. ప్రబుత్వాలు ఈ గ్రామం అభివృధికి  నిధులు విడుదల  చేసిన అవి ఆ ఊరిలో కొన్ని అభివ్రుది కార్యక్రమాలు మరియు వారికి అవసరమయిన సదుపాయాలను పూర్తి స్థాయిలో తీర్చలీపోతుంది. ఆర్మీ లేదా ఇండియన్ ట్రై ఫోర్సెస్ లో జాయిన్ అవ్వాలి అని అనుకునే వారికి సరయిన ట్రైనింగ్ ఇచ్చే మౌలిక వసతులను అందిచాల్సిన రాష్ట్ర మరియు దేశ ప్రబుత్వాలు వాటిలో విఫలం అవుతున్నాయి. 


   ఇటువంటి గ్రామాలు మన రాష్ట్రం లోనే మరొకటి కూడా ఉంది. అదే బావాజీ పాలెం. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం లోని తీర ప్రాతంలో ఉన్న ఈ పల్లెలో కూడా ఇంతకు ముందు మనం మాధవరం గురించి చెప్పుకునట్లుగా ప్రతి ఇంటి నుంచి ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది కూడా ఇండియన్ ఆర్మీ లో  వాళ్ళ సేవలను అందిస్తున్నారు. కాని ఇప్పటికి  ఈ గ్రామం ఎలాంటి అభివృధికి గాని మరేరకమయిన గుర్తింపు కు కాని నోచుకోకుండా ఆకరికి తాగే మంచి నీటి కోసం కూడా కష్టపడుతూనే ఉన్నారు. 


    ఇలాంటి దేశ సేవకులకు మనం ఆర్ధిక సహాయమే చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియో ను మరో నలుగురికి షేర్ చేసి మన ప్రబుత్వాల దృష్టికి తీసుకువెళ్తే చాలు.

Military Madhavaram | Special Story On The Military Madhavaram Village | Indian Army | Telugu Video,my show my talks,military madhavaram village,military madhavaram videos,military madhavaram,madhavaram village,indian army villages,history of military madhavaram,indian army top,top indian army,indian navy forces,army training videos,indian triforces,great india,india is great,bhavaji palem,bhavaji palem indian army,bavaji palem village,arugolanu fort,forts indian army.



Military Madhavaram | Special Story on Military Madhavaram Village | Indian Army Military Madhavaram | Special Story on Military Madhavaram Village | Indian Army Reviewed by M. Prabhakara Reddy on August 20, 2021 Rating: 5

No comments

If you have any doubts please let me know.

Featured Post

SASA LELE SALE IS LIVE! Grab Up to 85% Off on Smartphones, TVs, Laptops & More!

SASA LELE SALE IS LIVE! Up to 85% Off on Smartphones, TVs, Laptops & More! 🚀 S...

Ads Home

Travel everywhere!