Featured Post

5 Mysterious Temples In India | Top 5 Secret And Most Mysterious Temples In India

    మన దేశంలో మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. మన పూర్వీకులు అనేక కట్టడాలలో ఎన్నో రహస్యాలను ఇప్పటి మన కాలానికి అర్ధంకాని మరెన్నో ఆశ్చర్యకర విషయాలను పొందుపరిచి మనం డీకోడ్ చేయలేని విధంగా నిర్మించారు. ఇందులో సకానికి పైన యుద్ధాలు, దండయాత్రల కారణంగా నాశనం అయిపోయాయి. మరికొన్నింటిని మనం కాపాడుకోలేని పరిస్థితి. ఇప్పటికాలంలో ఇందులో చాలావరకూ కట్టడాలు ప్రభుత్వాల అజాగ్రత్త వల్ల నాశనం అయిపోతున్నాయి. షాకింగ్ గా ఉందా. నిజమే అధికారులకు కాని ప్రభుత్వాలకు కాని మనీ సంపాదించే పెద్ద పెద్ద గుడులు మరియు ఫారినర్స్ విసిట్ చేసేలా ఉండే మరికొన్నింటిని తప్ప చిన్న చిన్న హిస్టారికల్ సైట్స్ ను పట్టించుకోవడమే మానేశారు. ఇదంతా ఏమి నా assumption కాదు. నా కళ్ళతో నేను కొన్ని ప్లేస్ లను చూసాను తాగి పాడేసిన మందు బాటిల్స్, తిని వదిలేసినా ప్లేట్స్, డిస్పొసబుల్ ప్రొడక్ట్స్  ఇలా ఎంతో హిస్టరీ ఉన్న ఆ ప్లేస్ లను డస్ట్ బిన్స్ లా తయారు చేసారు. ఇదంతా ఎందుకు చెబుతున్న అంటే మీరు ఎప్పుడయినా ఎక్కడికయినా వెళ్ళినప్పుడు ఇలా ఎవరన్నా చేస్తుంటే వాళ్ళను ఆపుతారు అని లేదా మీరే చేస్తుంటే అలా చేయొద్దు అని చెప్పడానికి. ఈ నేచర్ మనకు ఇచ్చిన దానితో పోల్చుకుంటే ఇది పెద్ద పనేమీ కాదు మనకు.  

5. బృహదీశ్వర టెంపుల్ 

Top 5 Secret And Most Mysterious Temples In India | mysterious temples of india In Telugu | Facts,konark sun temple,brihadisvara temple,lord shiva,nandi idol,veerabhadra temple,lekapshi,kailasa temple,ellora caves,amazing temples in india,mysterious temples in india,my show my talks,temples,mysterious temples,ancient structures,mysterious,hinduism,aliens,ancient technology,sundial,secrets,mysterious places in the world,mystery temple,richest temple in india,top
Wiki Pkdinuu

      తమిళనాడు లోని తంజావూరు కు అతి సమీపంలో ఉన్న ఈ గుడి చరిత్ర ఇప్పటిది కాదు. సుమారుగా 1000 సంవచ్చరాల చరిత్ర కలిగిన గుడి ఇది. ఈ బృహదీశ్వర ఆలయాన్ని 1010వ సంవచ్చరంలో కట్టించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఇండియా మొత్తం లో అతి పెద్ద గుడులలో ఇదీ ఒకటి. ఈ గుడిని మొత్తం భూమి మీద అత్యంత స్ట్రాంగ్ మెటీరియల్స్ లో ఒకటయిన గ్రానైట్ తో నిర్మించారు. 216 అడుగుల ఎత్తులో ఉండే గుడి గోపురం పైన ఉండే ఏక శిలా కట్టడం ఒక్కటి 80 టన్నుల బరువు ఉంటుంది. అంతటి బరువయిన దానిని ఎటువంటి క్రేన్స్ మరియు మిషనరీ లేని ఆ కాలం లో అంత ఎత్తులో ఎలా అమర్చారనేది ఇప్పటి ఒక ప్రశ్నగానే ఉంది. ఈ గుడిని కట్టడానికి సుమారు లక్షా ముప్పై వేల టన్నుల గ్రానైట్ రాళ్ళను ఉపయోగించారు.  ఈ కాలంలోని టెక్నాలజీతో ఇప్పటి వాళ్ళకు కూడా కష్టంగా అనిపించే చిన్న చిన్న డ్రిల్ హోల్స్ ను ఇక్కడ మనం చూడొచ్చు. ఇవి చేయాలి అంటే డ్రిల్లింగ్ చేసే మెషిన్ కు చివర ఒక డైమండ్ ను అమరుస్తారు. అప్పటి రోజుల్లో వజ్రాలు అయితే ఉండేవి కాని డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ లాంటివి ఏవి లేని కాలం అది. అయినా ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. 

4. కోణార్క్ సన్ టెంపుల్

Top 5 Secret And Most Mysterious Temples In India | mysterious temples of india In Telugu | Facts,konark sun temple,brihadisvara temple,lord shiva,nandi idol,veerabhadra temple,lekapshi,kailasa temple,ellora caves,amazing temples in india,mysterious temples in india,my show my talks,temples,mysterious temples,ancient structures,mysterious,hinduism,aliens,ancient technology,sundial,secrets,mysterious places in the world,mystery temple,richest temple in india,top
Wiki Subhrajyoti07

    ఈ గుడిని 13వ శతాబ్దంలో 1238 నుంచి 1250 మధ్య కాలంలో Eastern Ganga dynasty కు చెందిన ఒకటవ  లాంగుల నరసింఘ దేవా అనే రాజు పరిపాలనలో నిర్మించినట్లు చెబుతారు. ఈ గుడిని 7 గుర్రాలు 24 చక్రాలు ఉండే ఒక రధంలా నిర్మించారు. 7 గుర్రాలు వారం లో 7 రోజులను, 24 చక్రాలు 24 నెలలను సూచించే విధంగా నిర్మించారు. అదిమాత్రమే కాదు ఈ రధ చక్రాలను ఖచ్చితమైన టైంను చూపించే సన్ డైల్ గా నిర్మించడం జరిగింది. ఇన్ని వందల సంవస్చారాల తరువాత కూడా ఇప్పటికీ పర్ఫెక్ట్ టైం ను ఈ సన్ డైల్స్ చూపిస్తాయి. ప్రస్తుతానికి ఈ చక్రాలలో ఉండే టైం ను మాత్రమే డీకోడ్ చేసారు, కాని ఈ వీల్స్ లో ఉండే మరెన్నో కార్వింగ్స్ ను డీకోడ్ చేయడానికి వందల సంవచారాలుగా ట్రై చేస్తూనే ఉన్నారు. మరెన్నో కట్టడాల మాదిరిగా ఈ కోణార్క్ సన్ టెంపుల్ లోని కొంత బాగాన్ని అనేక దండయాత్రల సమయం లో కూల్చేసినట్లు లికిత పూర్వక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఆ కూల్చిన ప్లేస్ యొక్క పైభాగంలో 52 టన్నుల పెద్ద ప్రత్యేకమయిన మాగ్నెట్ ఉండేదని, ఈ అయస్కాంతం గర్బగుడిలోని సూర్యుడి విగ్రహాన్ని గాలిలో తేలేలా చేసేదని అనేక రికార్డ్స్ మెన్షన్ చేయబడింది. ఇప్పటికీ అది ఏమయిందో ఎవరు దానిని నాశనం చేసారో ఎవరికీ తెలియదు. కోణార్క్ సన్ టెంపుల్ గురించి చెప్పుకుంటూ పోతే మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఒక వీడియోలో మీరు చూడాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. 

3. వీరభద్ర టెంపుల్

Top 5 Secret And Most Mysterious Temples In India | mysterious temples of india In Telugu | Facts,konark sun temple,brihadisvara temple,lord shiva,nandi idol,veerabhadra temple,lekapshi,kailasa temple,ellora caves,amazing temples in india,mysterious temples in india,my show my talks,temples,mysterious temples,ancient structures,mysterious,hinduism,aliens,ancient technology,sundial,secrets,mysterious places in the world,mystery temple,richest temple in india,top
wiki sriharsha95

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనంతపురం జిల్లాలో లేపాక్షి వద్ద ఉంది. ఈ గుడిని 16వ శతాబ్దంలో విజయనగర రాజులు కట్టించారు. ఈ గుడ్మోతం 70 స్థంభాలతో ఉంటుంది. అయితే విచిత్రం ఏంటంటే, వీటిలో ఒక స్థంభం మాత్రం నెలకు తగలకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది. ఈ వింతను చూడటానికి చాల ప్రదేశాల నుంచి ఎంతో మంది టూరిస్ట్ లు ఈ గుడికి వస్తారు. ఎంతో భరువయిన ఈ స్థంభం ఏలా గాలిలో ఎలా వేలాడుతుందో ఎవరికీ తెలియని ఒక రహస్యంగానే ఉండిపోయింది. 1910 లో బ్రిటీష్ ఇంజినీర్ ఈ వింత స్తంభాన్ని చూసి ఆశ్చర్యపోయి. ఆ స్తంభానికి నేలకు మధ్య ఉన్న కాలీని ఫిల్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే దానివల్ల ఆ ఆలయ కట్టడం బీటలు వారడం గమనించి ఆ పనిని విరమించుకున్నాడు. ఆ బ్రిటీష్ ఇంజినీర్ ఆ స్థంభం పై ఎన్నో పరిశోధనలు చేసినా దాని నిర్మాణా రహస్యాన్ని మాత్రం కనిపెట్టలేకపోయాడు. అదే ఆలయంలో అతిపెద్ద పాద ముద్ర ఒకటి ఉంది. సుమారు మూడు అడుగుల పొడవుతో ఇది ఉంటుంది. అంత పెద్ద పాద ముద్ర ఎవరిదై ఉంటుంది, అక్కడకు అది ఎలా వచ్చింది అనేదే కూడా ఒక మిస్టరీ గానే ఉంది. దేవాలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో ఏకరాతితో చెక్కబడిన పెద్ద నంది విగ్రహం ఇక్కడ ఉంది. ఈ విగ్రహం ప్రపంచంలోని అతి పెద్ద విగ్రహాలలో ఒకటి.

2. అనంత పద్మనాభ స్వామి టెంపుల్

        కేరళ లోని తిరువనంతపురంలోని ఈ ఆలయం ఎవరు కట్టారో ఎప్పుడు కట్టారో ఇప్పటికి ఎవరికీ తెలియదు. కాకపోతే కొన్ని పురాణాల ప్రకారం ఈ గుడిని సంగమ పిరియడ్ లో  అంటే రెండు వేల నుంచి రెండువేల ఆరువందల సంవస్చారాల క్రితం నిర్మించారు అని చెబుతారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయంగా పేరుగాంచి ఈ ఆలయంలో సుమారు 24 బిలియన్ డాలర్స్. ఈ గుడి నేలమాలిగలలో దొరికిన కేవలం ఒక విష్టువు ఒక్క విగ్రం విలువే 500 కోట్లు. ఈ సంపద మొత్తం ఆ గుడి నేలమాళిగలో ఉన్న 5 గదులలోనుంచి తేసినదే. ఇంకా అక్కడి తెరువని మరి 3 అతిపెద్ద గదులు ఉన్నాయి. కాని వాటిలో ఒక గది తలుపు పై పెద్ద పెద్ద సర్పాలతో ఉంది. వాటిని నాగబంధనం అని అవి తెరవాలి అంటే కొన్ని ప్రత్యేకమయిన మంత్రలతోనే సాధ్యం అవుతుందట. అలా కాదని బలవంతంగా వాటిని తెరవాలని చూస్తే పెద్ద ప్రమాదమేదో జరుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. ప్రజల మనోభాలను దెబ్బ తీయడం ఇష్టంలేక కోర్ట్ ఇప్పటికీ వాటిని తెరవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఆ గదికి నాగాబంధనం ఎందుకు వేసారు, వాటిని అంత సీక్రెట్ గా అక్కడ నిర్మించడానికి గల కారణాలు ఏంటో ఇప్పటికి ఎవరికీ తెలియదు.

1. కైలాస టెంపుల్

       మహారాష్ట లోని Aurangabad లో ఎల్లోరా గృహాల వద్ద ఉంది ఈ గుడి. ఈ ఆలయాని కూడా ఎప్పుడు కట్టారు అనే సరయిన ఆధారాలు లేవు. దాదాపుగా 1000 నుండి 1400 సంవస్చారాలకు పూర్వం రాష్ట్రకూట వంశానికి చెందిన రాజులు ఈ ఏకశిలా కట్టడాన్ని నిర్మించినట్లు కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. ఈ ఆలయాన్ని మొత్తం ఒక గ్రానైట్ కొండ పైనుంచి కిందకు చెక్కుకుంటూ నిర్మించారు. అందుకే దీనిని ఏకశిలా కట్టడం అంటారు. ఇక్కడ ఉన్న మొత్తం గుహలు నిర్మించడానికి 500 సంవస్చరాలు పట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా ఫలకంతో చేసిన ఆలయం ఇది. ఇక్కడ మొత్తంగా 100 వరకు caves ఉన్నాయి. కాకపోతే అందులో కేవలం 34 మాత్రమే మనం చూడటానికి అనుమతి ఉంది. మిగిలిన కేవ్స్ ను రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ పరిగణించి క్లోజ్ చేసేసారు. ఈ 34 ఎల్లోరా గుహలలో హిందూ, బౌద్ధ మరియు జైన దేవాలయాలు ఉన్నాయి. ఆలయంకట్టడానికి సుమారు 4లక్షల టన్నుల రాయిని త్రవ్వినట్టు కొన్ని ఆధారాల ద్వారా స్పష్టమవుతుంది. ఇంతటి గొప్ప అద్బుతాన్ని కొన్ని వందల సంవస్చారాల క్రితం సాధారణ పనిముట్లు ఉపయోగించి ఇంత పెద్ద ఆలయాన్ని ఎలా కట్టారో అనేది అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. 

ఇంటువంటి అద్బుతాలకు ఇండియా లో కొదవే లేదు. ఇలాంటి చారిత్రాత్మక కట్టడాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. మీలో ఎవరన్నా వీటిని చూసి ఉంటె లేదా వీటిలో ఏదన్నా ప్లేస్ ను  చూడాలి అని అనుకుంటే ఆ ప్లేస్ నేమ్ ను కింద కామెంట్ చేయండి. 
జై హింద్

Top 5 Secret And Most Mysterious Temples In India | mysterious temples of india In Telugu | Facts,konark sun temple,brihadisvara temple,lord shiva,nandi idol,veerabhadra temple,lekapshi,kailasa temple,ellora caves,amazing temples in india,mysterious temples in india,my show my talks,temples,mysterious temples,ancient structures,mysterious,hinduism,aliens,ancient technology,sundial,secrets,mysterious places in the world,mystery temple,richest temple in india,top

5 Mysterious Temples In India | Top 5 Secret And Most Mysterious Temples In India 5 Mysterious Temples In India |  Top 5 Secret And Most Mysterious Temples In India Reviewed by M. Prabhakara Reddy on September 10, 2021 Rating: 5

No comments

If you have any doubts please let me know.

Featured Post

SASA LELE SALE IS LIVE! Grab Up to 85% Off on Smartphones, TVs, Laptops & More!

SASA LELE SALE IS LIVE! Up to 85% Off on Smartphones, TVs, Laptops & More! 🚀 S...

Ads Home

Travel everywhere!