Featured Post

Birsa Munda Biography | Birsa Munda History | Who was Birsa Munda?

          చిన్నతనం నుంచి మనఅందరికి తెలిసిన మన్యంవీరుడు అంటే అల్లూరి సీతారామరాజు. 
స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మనకు తెలిసిన మన్యం వీరుడు ఈ అల్లూరి. కాని ఈయనకంటే ముందే ఒక మన్యం వీరుడు స్వతంత్ర పోరాటం లో పాల్గొని, తాను ముందుండి ఎన్నో లక్షల మందిని ముందుకు నడిపించాడు అని మనలో చాలా మందికి తెలియదు. అటువంటి గొప్ప వీరుడి కధే ఈ వీడియో. 

     సుబాష్ చంద్రబోస్, భగత్ సింగ్, మహాత్మాగాంధీ, సర్దార్ వల్లాభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మరెందరో గొప్ప గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ మనకు తెలుసు. కాని  ముఖ్యంగా సౌత్ ఇండియా లో అసలు వినిపించని ఒక మన్యం ఫ్రీడమ్ ఫైటర్ బిర్సా ముండా. తన ఇరవయ్యవ ఏటనే బ్రిటీషర్స్ ను వణికించిన విప్లవాత్మక వీరుడు బిర్సా ముండా. ఈయన 1875 లో అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీ అంటే ఇప్పటి ఝార్ఖండ్ స్టేట్ లో ఉలిహట్ అనే అటవీ ప్రాంతం లో జన్మించారు. మరే మన్యం వీరుడి కి దక్కని విధంగా ఇండియన్ పార్లమెంట్ మ్యూజియం లో బిర్సా ముండా చిత్రపటం తో  ఆయను గౌరవించారు అంటేనే అర్ధమవుతుంది బిర్సా ఎంతటి గొప్ప స్వతంత్ర సమయోదుడో అని. 

Birsa Munda Biography | Indian tribal freedom fighter Birsa Munda | Birsa Munda | My Show My Talks,birsa munda,Birsa munda telugu,birsa munda biography,birsa munda real story,indian freedom fighter,indian tribals,tribals,manyam veerudu,indian great persons,legeds,birsa,munda,munda tribe,munda tribbles,birsa university,birsa airport,birsa collage,birsa adivasi,birsamunda jayanthi,motivational story,my show my talks,birsa munda telugu,birsa telugu,biography
Birsa Munda
    బిర్సా తండ్రి సుగణ ముండా, తల్లి కర్మి ముండా. బిర్సా బాల్యం అంతా ప్రకృతి వొడిలో ఆట పాటలతో గడిచింది. బిర్సా స్వతహాగా మంచి సంగీత ప్రియుడు. తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను, బ్రిటీష్ దోపిడీ దారుల వ్యవస్థను చూసి చలించిపోయేవాడు. కాని ఆ చిన్న వయస్సుల్లో ఏమీ చేయలేక తనలో తానే బాధపడేవాడు. బిర్సా ఎప్పుడు ఒక చోట ఉండేవాడు కాదు. నిరంతరం రకరకాల ప్రదేశాలు తిరగడంవల్ల ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూనే ఉండేవాడు. బిర్సా ముండా ఎంత ముక్కుసూటిగా ఉండేవాడంటే తన ముందు ఎంతటి వారు ఉన్న ఒక్క క్షణం కూడా తడబడకుండా ప్రశ్నించేవాడు. తనకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం, తినడానికే కష్టమంటే ఇక చదువు కోసం కర్చుపెట్టే స్తోమతలేని బిర్సా తల్లితండ్రులు బిర్సా ను వాళ్ళ  బదువుల ఇంటికి పంపేసారు. అహుబటు గ్రామంలో తన మామయ్య ఇంట్లో ఉంటూ దగ్గర్లోని సాల్గా అనే గ్రామంలోని పాఠశాలలో చేరాడు. తిరిగి ఇంటికి వచ్చాకా తల్లితండ్రులు ఎంత కాదన్నా తాను చదువుకుని తీరాలి అని మొండి పట్టుదలతో తిండి కూడా మానేస్తాడు. దీంతో చేసేదేమీ లేక బిర్సా ను సుగణ ఉలిహట్ లోని బూర్జు మిషనరి స్కూల్ లో జాయిన్ చేస్తాడు. అతని ప్రతిభను గమనించి పశ్చిమ సింగ్ భూం జిల్లా కేంద్రమైన చైబాసాలో మరో మిషనరీ పాఠశాలకు పంపించారు స్కూలు యాజమాన్యం. అక్కడ ఆయన పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్రవిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాడు. ఫలితంగా బ్రిటిష్ పాలకుల అణిచివేత, వారు చేస్తున్న దోపిడిని అర్థం చేసుకున్నాడు.

                                             Birsa Munda Biography | Indian tribal freedom fighter Birsa Munda | Birsa Munda | My Show My Talks,birsa munda,Birsa munda telugu,birsa munda biography,birsa munda real story,indian freedom fighter,indian tribals,tribals,manyam veerudu,indian great persons,legeds,birsa,munda,munda tribe,munda tribbles,birsa university,birsa airport,birsa collage,birsa adivasi,birsamunda jayanthi,motivational story,my show my talks,birsa munda telugu,birsa telugu,biography

       విద్యను బోధించడానికి స్కూల్ లోని గురివులు బిర్సా ను తన మతం మార్చుకోవాలి అని చెప్పారు. తనకు ఇష్టం లేకున్నా కేవలం చదువుకోవాల్లన్న ఒక్క ఆశతో ఆకరికి తన మతం మార్చుకోవడానికి అంగీరించారు. బిర్సా ముండా కాస్తా బిర్సా డేవిడ్ గా పేరును మార్చేసారు. అప్పటికాలంలో మత మార్పిడులు ఈ విధంగానే జరిగేవి. కేవలం ఒక విద్యార్ధి యొక్క మతం మాత్రమే కాదు, మొత్తం కుటుంబ సభ్యులను కూడా మత మార్పిడి చేసేవారు. అప్పట్లో బ్రిటిష్ మరియు జర్మన్స్ తమ మిషనరీ స్కూల్స్ ను వాళ్ళ వ్యాపార అవసరాలకోసం ప్రవేసపెట్టడం వల్ల బిర్సాకు అతను ఆశించిన జ్ఞానం ఆ స్కూళ్ళు ఇవ్వలేకపోయాయి. పైచదువులు చదవాలంటే మతం తప్పక మార్చుకోవాలన్న నిబంధన తనకు తన కుటుంబ సభ్యులకు ఏమాత్రం నచ్చక స్కూల్ కు వెళ్ళడమే మానేసాడు. తాను మానడమే కాకుండా మతం పేరుతో ఆ స్కూల్ వారు చేసే అఘాయిత్యాలు తన తోటివారికి చెప్పి, వాళ్ళను కూడా మాన్పించాడు. మిషనరీల ఆలోచన ఆచరణ మొత్తం మతం చుట్టూనే తిరుగుతుందని తెలుసుకుని అందులోంచి బయటపడ్డాడు.

      1890 లో తిరిగి తన సాంప్రదాయ గిరిజన మతాన్ని స్వీకరించాడు. జనాభా పరంగా జార్ఖండ్ స్టేట్ మొత్తానికి సంతాల్ అనే గిరిజన జాతి అతిపెద్ద తెగ. అటువంటి సంతాల్ మరియు ముండా తెగల గిరిజనులపై బ్రిటిష్ ప్రభుత్వం దారుణమయిన విధానాలతో వారి భూములపై అధిక పన్నులు వసూలు చేస్తూ పండించిన పంటలో 55% పంటను కూడా అన్యాయంగా వసూలు చేసేవారు. అప్పటి జమీందారి వ్యవస్థ బ్రిటీషర్లతో చేతులు కలిపి గిరిజన భూములను వారి ఆస్తులను దోచుకునేవారు. అలా వారికింద సంతాల్, ముండా తెగలుతో పాటు మరో 145 గ్రామాల వాసులు అంటరానివారిగా బానిసలుగా మారారు. 

                             Birsa Munda Biography | Indian tribal freedom fighter Birsa Munda | Birsa Munda | My Show My Talks,birsa munda,Birsa munda telugu,birsa munda biography,birsa munda real story,indian freedom fighter,indian tribals,tribals,manyam veerudu,indian great persons,legeds,birsa,munda,munda tribe,munda tribbles,birsa university,birsa airport,birsa collage,birsa adivasi,birsamunda jayanthi,motivational story,my show my talks,birsa munda telugu,birsa telugu,biography

     జమీందారి వ్యవస్థలో అందరు బ్రిటీషర్ల కింద ఉండడం వల్ల గిరిజన స్త్రీల పై అఘాయిత్యాలు ఎక్కువయిపోయాయి. వారి భూములు కోల్పోవడం వల్ల చాలామంది గిరిజనులు జీవనోపాది కోల్పోయి, ఆకరికి ఏమి చేయలేని పరిస్థితులలో బ్రిటిష్ వారు చూపిన బానిస బ్రతుకే ఆశగా, మతం మార్చుకుని బానిసలుగా మారారు. ఇదంతా చూస్తున్న బిర్సా నమ్మకమయిన తన తోటి గిరిజనుల సమూహాన్ని ఏర్పరిచి, ఆ అనుచరుల ముందుడినడిపిస్తూ బ్రిటీషర్లపై విరుచుకుపడ్డాడు. ఆ మహా విప్లవాన్ని Ulgulan అని అన్ట్టారు. 1894 లో జమీందారుల దగ్గర ఉన్న అడవీ భూములను, అక్రమంగా లాక్కున్న గిరిజన భూములను తిరిగి ఇవ్వాలని నిరసన చేశాడు. జార్ఖండ్, ఒడిషా, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్య ప్రదేశ్ యుద్దాలలో వెన్నుముకలా నిలిచాడు బిర్సా ముండా. ఆ యుద్ధ సమయంలో అక్కడి గిరిజనులకి వారి హక్కులు తెలియచేసాడు. భూమికోసం, భుక్తి కోసం, గిరిపుత్రుల భానిస బ్రతుకుల విముక్తికోసం ఈ విప్లవం అంటూ సమర శంక్కాని పూరించాడు. 

     నిజానికి బిర్సా శాంతి మార్గాన  పోరాటం చేయాలని అనుకునేవాడు. కాని గిరిజన ప్రజలందరూ పోరాట మార్గంలోనే నడవాలని అదే సరయిన దారి అనడంతో, ఆయుధాన్ని చేతపట్టాడు. ప్రజల విశ్వాసాలతో ఆడుకున్న బ్రిటీషర్లను, మిషనరీల అధికారులను, మొత్తం జమీందారి వ్యవస్థను, భూస్వామ్య వాదులను ఎదిరించారు. పోలీస్ స్టేషన్ల పై మెరుపు దాడులు చేసారు. అప్పటివరకు అమాయకులుగా ఉన్న ప్రజలు అలుపెరగని పోరాటానికి సిద్హంయ్యారు. బిర్సా ఆలోచన అతని మాటకున్న శక్తి చేరి గిరిపుత్రులను సైనికులుగా మార్చింది. ఈ విప్లవ పోరాటం కేవలం అక్కడి ప్రజలకోసం ప్రారంభమయినా, స్వాతంత్ర్య పోరాటానికి స్పూర్తినిచ్చింది. ఇది కేవలం గిర్జనుల హక్కుల కోసం మాత్రమే కాదు, ముండా తెగ సంప్రాదాయాలను కాపాడుకోవడం కోసం జరిగిన పోరాటం. అడవిపుత్రుల హక్కులను సాదిన్చుకునేందుకు జరిగిన విప్లవ పోరాటం. తెల్లదొరలను తరిమికొట్టడానికి జరిగిన ప్రయత్నం. 

      గిరిజనుల ఐక్యత స్థానిక క్రైస్తవ మిషనరిలకు ఇబ్బంది కలిగించింది. బ్రిటిష్ ప్రభుత్వం బిర్సా పై కోపంపెంచుకుని అక్కడి ప్రజలపై దోపిడీని మరింత పెంచారు. బ్రిటిష్ మరియు జమీన్ధారులపై ఎదురుతిరిగినందుకుగాను బిర్సా కు 2 సంవస్చారాలు జైలు శిక్షను విధించారు. విడుదలయిన తరువాత మళ్ళీ తన అనుచరులను ఒకటిచేసి తిరుగుబాటును ప్రారంబించాడు. 1897 లో 400 మంది తో కలిసి కుంతి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి విజయం సాదించాడు. ఇలా మరెన్నో పోరాటాలు, మరింకెన్నో ఉద్యమాల నడుమ బిర్సా జీవితం కొనసాగుతుంది. 

                             Birsa Munda Biography | Indian tribal freedom fighter Birsa Munda | Birsa Munda | My Show My Talks,birsa munda,Birsa munda telugu,birsa munda biography,birsa munda real story,indian freedom fighter,indian tribals,tribals,manyam veerudu,indian great persons,legeds,birsa,munda,munda tribe,munda tribbles,birsa university,birsa airport,birsa collage,birsa adivasi,birsamunda jayanthi,motivational story,my show my talks,birsa munda telugu,birsa telugu,biography, birsa munda in telugu, telugu birsa munda

       అవకాసం కోసం ఎదురుచూస్తున్న అధికారులకు, ఉద్యమ కార్యక్రమాలలో భాగంగా గుట్టపై బిర్సా సమావేసమయినట్లు తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. లొంగిపోమని హెచ్చరించారు. అయితే బిర్సా బద్రత ముక్యమని భావించిన తన అనుచరులు అక్కడనుంచి బిర్సాను తప్పించి పోలీసులతో బీకర పోరాటమే చేసారు. బ్రిటీషర్లు అంతటితో ఆగలేదు. గూడెంలో ఉండే ప్రజలపై ఆంక్షలు విదించి, ఆడవారిపై హత్యాచారాలు చేసారు. ఇదంతా ఆగాలి అంటే బిర్సాను తన ముఖ్య అనుచరులను అప్పగించాలని హెచ్చరించారు. అంతేకాకుండా బిర్సా ను అప్పగించినవారికి నగదు బహుమతిని కూడా ప్రకటించింది ప్రభుత్వం. దీనితో డబ్బుకోసం ఆశపడిన కొందరు బిర్సా ఉన్న ప్రాంతాన్ని అధికారులతో చుట్టుముట్టారు. బిర్సా ను అరెస్ట్ చేసినా అతను రాజేసిన ఉద్యమకాంక్ష మరింత పెరుగుతుందేమో అనే ఆలోచనతోనే  బ్రిటిష్ అధికారులు భయపడేవారు. జైలు గోడలను కూడా బద్దలుకొట్టి బిర్సా ముండ ను అతని అనుచరులు  విదిపించుకుపోతరనే భయంతో అతని ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడలేదు బ్రిటిష్ ప్రభుత్వం.

                             Birsa Munda Biography | Indian tribal freedom fighter Birsa Munda | Birsa Munda | My Show My Talks,birsa munda,Birsa munda telugu,birsa munda biography,birsa munda real story,indian freedom fighter,indian tribals,tribals,manyam veerudu,indian great persons,legeds,birsa,munda,munda tribe,munda tribbles,birsa university,birsa airport,birsa collage,birsa adivasi,birsamunda jayanthi,motivational story,my show my talks,birsa munda telugu,birsa telugu,biography, birsa munda in telugu, telugu birsa munda

       బిర్సా ను మిగతా కైదీల నుంచి వేరుగా ఉంచారు. అతను తినే భిజనం లో విషం కలపడం ప్రారంభించారు. ఒకేసారి చనిపోతే ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుంది అని భావించిన బ్రిటీషర్లు ఇలా చేసారు అనే ఒక వాదన ఉంది. అలా బిర్సాను మ్రుత్యువోడికి పంపారు. జూన్ 9 1900 సంవస్చారంలో తీవ్ర అనారోగ్యంతో బిర్సా తన ఆకరి శ్వాసను విడిచారు. చనిపోయే సమయానికి అతని వయస్సు కేవలం 25 సంవస్చరాలు. బిర్సా కలరా వ్యాధితో చదిపోయాడు అని ఒక రిపోర్ట్ తయారు చేయించారు. కాని అదంతా ఎవరు నమ్మలేదు. కావాలనే బిర్సా ముండా ను చంపేశారు అని ప్రజలకు తెలుసు. 

        అంతటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కేవలం ఒక యుక్త వయస్సు కుర్రవాడు ఒనికించాడు అంటే అది మామూలు విషయం కాదు. ఆయన చూపిన మార్గం లోనే మరెంతోమంది వీరులు స్వాతంత్ర్య పోరాటంలో ముందుకు అడుగులు వేసారు. ఆయన రగిల్చిన ఉద్యమకాంక్షను గుర్తించిన జార్ఖండ్ ప్రభుత్వం 
    
కుంతి లోని Birsa College, 
Birsa Munda Central Jail, 
Birsa Munda Tribal University ఇలా ఎన్నింటికో ఆయన గౌరవార్ధం ఈ పేరును పెట్టారు. 

                            Birsa Munda Biography | Indian tribal freedom fighter Birsa Munda | Birsa Munda | My Show My Talks,birsa munda,Birsa munda telugu,birsa munda biography,birsa munda real story,indian freedom fighter,indian tribals,tribals,manyam veerudu,indian great persons,legeds,birsa,munda,munda tribe,munda tribbles,birsa university,birsa airport,birsa collage,birsa adivasi,birsamunda jayanthi,motivational story,my show my talks,birsa munda telugu,birsa telugu,biography, birsa munda in telugu, telugu birsa munda

    1988 లో భారత ప్రభుత్వం బిర్సా ముండా చిత్రంతో ఉన్న ఒక పోస్టల్ స్టాంప్ ను కూడా విదులచేసారు. ప్రతీ సంవస్చారం నవంబర్ 15 న జార్ఖండ్ ప్రభుత్వం బిర్సా ముండ జయంతిని ఘనంగా జరుపుకుంటుంది. అటువంటి ఒక గొప్ప వీరుడి గురించి మీకు చెప్పినందుకు గర్వంగా ఉంది.  జై హింద్.

Birsa Munda Biography | Indian tribal freedom fighter Birsa Munda | Birsa Munda | My Show My Talks,birsa munda,Birsa munda telugu,birsa munda biography,birsa munda real story,indian freedom fighter,indian tribals,tribals,manyam veerudu,indian great persons,legeds,birsa,munda,munda tribe,munda tribbles,birsa university,birsa airport,birsa collage,birsa adivasi,birsamunda jayanthi,motivational story,my show my talks,birsa munda telugu,birsa telugu,biography, birsa muna biography in telugu, Birsa munda telugu story, Birsa Munda Life Story In Telugu, Freedom Fighter Birsa Munda Life Story In Telugu, Birsa Munda Biography In Telugu

Birsa Munda Biography | Birsa Munda History | Who was Birsa Munda? Birsa Munda Biography | Birsa Munda History | Who was Birsa Munda? Reviewed by M. Prabhakara Reddy on August 17, 2021 Rating: 5

No comments

If you have any doubts please let me know.

Featured Post

SASA LELE SALE IS LIVE! Grab Up to 85% Off on Smartphones, TVs, Laptops & More!

SASA LELE SALE IS LIVE! Up to 85% Off on Smartphones, TVs, Laptops & More! 🚀 S...

Ads Home

Travel everywhere!