Featured Post

Why Does The Moon Glow | What Makes The Moon Shine? Moon Facts

        ప్రకాశవంతమైన స్పష్టమైన రాత్రిలో చంద్రుడిని చూడటం మనందరికీ ఇష్టం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా "చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడు అని? మనందరం రోజు రాత్రి ఆరు బయటనున్చు నో లేదా బిల్డింగ్ పైకి ఎక్కో చూస్తే మన కంటికి కనిపించే చందమామ ఒకే ఒక్కటి. కాని మన విశ్వం లో మొత్తం 200 కు పైన మూన్స్ ఉన్నాయి అని మీలో ఎంతమందికి తెలుసు? మెర్క్యురీ మరియు వీనస్ గ్రహాలకు తప్ప మిగతా మేజర్ ప్లానెట్స్ అన్నింటికీ కూడా మనకు ఉన్నట్లు గానే అన్ని గ్రహాలకు ఒకో చంద్రుడు ఉన్నాడు. చిన్న గ్రహమయిన  ప్లూటో కు, అతి చిన్న చిన్న వేరే గ్రహాలకు, ఆకరికి అనేక గ్రహశకలాలకు కూడా మూన్స్ ఉన్నాయి. సరే అదంతా వేరే టాపిక్. అసలు మూన్ ఎలా ఏర్పడింది? ఎందుకు అది వెలుగుతూ ఉన్నటు కనిపిస్తుంది వంటి ఇంటరెస్టింగ్ విషయాలతో పాటు మరికొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు ఈ వీడియో లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం! 

How Does The Moon Glow? | & Facts About Moon and Earth | In Telugu | My Show My Talks,How Does The Moon Glow?,Facts About Moon and Earth,telugu videos,telugu fact videos,telugu facts,moonlight,how moon shines,why does the moon shine only at night,my show my talks,prabhakar reddy,Why is the moon so shiny tonight?,chandamama,Why moon shines white,What is the colour of Moon,moon telugu,moon facts telugu,facts about the moon,amazing facts about the moon in telugu

          ఒకప్పటి రీసెర్చ్ ల ప్రకారం చంద్రుడు మరియు భూమి కి ఒకే వయస్సు అని ఈ రెండింటికి  4.543 billion సంవస్చారాల అని  భావించేవారు. 2011 జరిపిన కొన్ని రీసెర్చ్ ల ప్రకారం ఎర్త్ కంటే మూన్ 200 మిలియన్ ఇయర్స్ చిన్నది అని కన్ఫార్మ్ చేసారు.  అప్పుడు జరిగిన ఆ సంగటన వల్లనే ఎర్త్ కు ఒక న్యాచురల్ శాటిలైట్ ఏర్పడింది. అదే మూన్. వీటిల్లో అనేక రకాల థియరీస్ ఉన్నప్పటికీ ఫైనల్ గా ఈ రోజు చాలా విస్తృతంగా ఆమోదించబడినది జెయింట్-ఇంపాక్ట్ థియరీ.

          సైజు లో మార్స్ ప్లానెట్ తో సమానంగా ఉండే  ఒక గ్రహం భూమిని నాశనం చేయడానికి 4.5 బిలియన్ సంవస్చారాల  క్రితం  భూమి పైకి వేగంగా వచ్చి ఎడ్జ్ లో డీకొంది. దీనివల్ల డీకోట్టిన గ్రహం యొక్క పార్టికల్స్ కొన్ని, ఎర్త్  పార్టికల్స్ మరికొన్ని కలిసి, ఎర్త్ నుండి సెపరేట్ అయ్యి స్పేస్ లో ఒక ముద్దలా చేరి,  కొంతకాలానికి గ్రావిటీ వల్ల ఆ పార్టికల్స్ అన్నీ కలిసి ఒక గోళంగా ఫార్మ్ అయ్యాయి. అదే మూన్. మన భూమికి హై మాగ్నటిక్ ఫీల్డ్ ఉండటంతో ఈ ఏర్పడిన చంద్రున్ని ఒకే ఆర్బిట్ లో తిరిగేలా భూమి ఉంచగలిగింది. మనలో చాలా మంది అనుకునేది ఏంటంటే మూన్ కూడా భూమి తో సామానమయిన డయామీటర్ లో ఉంటుంది అనుకున్ట్టారు. ఎర్త్ యొక్క డయామీటర్ 12,742 km అయితే మూన్ వేల్యూ వచ్చి 3,474.2 km. ఎర్త్ తో పోలిస్తే చంద్రుడు తన సైజు లో 73% చిన్న వాడు. అందుకనే అక్కడి గ్రావిటీ కూడా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ముందుకు నడవాలి అంటే కచ్చితంగా జంప్ చేస్తేనే అది సాధ్యం అవుతుంది. 

          కాని  సౌర వ్యవస్థతో పోల్చినప్పుడు మనకు రోజు కనిపించే చందమామ ఐదవ అతిపెద్ద చంద్రుడు. 

How Does The Moon Glow? | & Facts About Moon and Earth | In Telugu | My Show My Talks,How Does The Moon Glow?,Facts About Moon and Earth,telugu videos,telugu fact videos,telugu facts,moonlight,how moon shines,why does the moon shine only at night,my show my talks,prabhakar reddy,Why is the moon so shiny tonight?,chandamama,Why moon shines white,What is the colour of Moon,moon telugu,moon facts telugu,facts about the moon,amazing facts about the moon in telugu

          చంద్రుడు సూర్యుడిలా వేలుగుతాడు కాబట్టే మనం వెన్నలను చూడగలుగుతున్నాం అని చాల మంది నమ్ముతారు. నిజానికి చంద్రుడు తనకు తాను ఎటువంటి కాంతిని సృష్టించలేడు.  తను ఒక డెడ్ ఆబ్జెక్ట్. మూన్ ఫార్మ్ అయిన తరువాత చాల కాలం వరకు అగ్ని గోళంలా మండి తరువాత చల్లబడ్డాడు. చెప్పాలంటే అచ్చం మన భూమిలా. చంద్రుని పై సూర్యుడి కిరణాలు పడటం వల్ల అలా పడిన లైట్ ను రిఫ్లెక్ట్ చేసి చంద్రుడు మెరుస్తాడు. అంతే కాని చంద్రునికి స్వతహాగా వెలుగునిచ్చే ఎలాంటి శక్తి లేదు. 

        భూమి చంద్రున్ని ఏ విధంగా అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ తో లాగుతుందో చంద్రుడు కూడా భూమిని అదే మాదిరిగా లాగడం జరుగుతుంది. కాని మన భూమి అతి పెద్దది కావడంతో ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్లే మనకు సముద్రంలో అలలు పెద్దవిగా ఏర్పడటం జరుగుతుంది. అలలు కేవలం చంద్రుని వల్లే ఏర్పడతాయి అని కాదు, ఇవి కూడా ఒక కారణం అంతే. 

     చంద్రుడు ప్రతీ సంవత్సరం 3.8 సెంటీమీటర్స్ అంటే 1.5 ఇంచెస్ భూమికి దూరంగా జరుగుతున్నాడు. అందువల్లనే మన పూర్వీకుల కంటే చంద్రుని కాస్త చిన్న సైజు లోను మరియు కొంచం తక్కువ వేలుగుతోను చూస్తున్నాం. ఇదే కంటిన్యు అయితే మాత్రం సుమారు 50 బిలియన్ సంవత్సరాల తరువాత నెలకు 47 రోజులు గా మారుతుంది, అప్పుడు రోజులో 24 కాకుండా మరిన్ని hours యాడ్ అవుతాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  ప్రస్తుతం చంద్రుడు భూమి కక్షలో ఎంత ట్రావెల్ చేసినాకాని మనం ఎప్పుడు చంద్రుడికి సంబందించిన ఒక వైపును మాత్రమే చూడగలుగుతున్నాం. కాని భూమి కూడా 50బిలియన్ సంవత్సరాల తరువాత చంద్రుని లాగే ఎప్పుడు ఒకే సైడ్ తిరిగే అవకాసం ఉంది అని చెబుతున్నారు. 

       భూమి పై భూకంపాలు ఎలా అయితే వస్తాయో మూన్ పై కూడా moonquakes అలానే ఏర్పడతాయి. అవి అక్కడ రావడానికి కారణం కూడా భూమే. భూమి మరియు చంద్రుల మధ్య  stretching మరియు gravitational pull వలన ఇవి సంభవిస్తాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఎన్నో వేలసంవత్సరాలుగా మూన్ కు సంబంధించి ఒక సైడ్ ను మాత్రమే మనం రోజు చూస్తున్నాం. మూన్ కి అటు వైపు ఏముంది అనేది ఎప్పుడు కూడా ఒక ప్రశ్నగానే ఉండేది. కాని అక్టోబర్ 7, 1959 లో సోవియట్ కు చెందిన ప్రోబ్ లునా 3 హిస్టరీ లో ఫస్ట్ టైం మూన్ యొక్క డార్క్ సైడ్ ను మనకు చూపించింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్ అదే. ఆ తరువాత చైనా యొక్క Chang'e -4 ప్రోబ్ 2019 జనవరి 3 న మనకు కనిపించని మూన్ డార్క్ సైడ్ లేదా ఫార్ సైడ్ న సేఫ్ గా ల్యాండ్ అయిన మొట్ట మొదటి స్పేస్ క్రాఫ్ట్ గా నిలిచింది. 1959 నుంచి 2019 వరకు మూన్ పైకి అనేక దేశాలు ఎన్నో సార్లు సేఫ్ లాండింగ్ ట్రై చేసినా అది ఫలించలేదు. 2019 లో చైనా ఆ ఘనత సాదించింది. 

How Does The Moon Glow? | & Facts About Moon and Earth | In Telugu | My Show My Talks,How Does The Moon Glow?,Facts About Moon and Earth,telugu videos,telugu fact videos,telugu facts,moonlight,how moon shines,why does the moon shine only at night,my show my talks,prabhakar reddy,Why is the moon so shiny tonight?,chandamama,Why moon shines white,What is the colour of Moon,moon telugu,moon facts telugu,facts about the moon,amazing facts about the moon in telugu
www.nasa.gov
        చంద్రుడికి అటువైపు భాగం అంతా పెద్ద పెద్ద గుంతలతో ఈ ఇమేజ్ లో మనం చూడొచ్చు. మరియు అక్కడ ఉండే మట్టి సేమ్ గన్ పౌడర్ లాంటి స్మెల్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న Panorama ఇమేజ్ కూడా ఆ శాటిలైట్ తీసినదే.  

       అనేక దేశాలు మూన్ పైకి శాటిలైట్ పంపించడం లో ఎన్నో సార్లు ఫెయిల్ అయిన సందర్బాలు ఇక్కడ మీరు చూడొచ్చు. కాని భరత్ కు చెందిన స్పేస్ ఏజెన్సీ ISRO తను మొదలు పెట్టిన ఫస్ట్ మిషన్ తోనే ప్రపంచం స్థాయి పేరుని సంపాదించింది. భారతదేశపు మొదటి లూనార్ ప్రోబ్ చంద్రయాన్ -1. దీనిని 22 అక్టోబర్ 2008న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రారంభించింది. ఈ మిషన్‌లో లూనార్ ఆర్బిటర్ అండ్ impactor ఉన్నాయి. ఈ స్పేస్ ప్రోగ్రాం కోసం మన దేశం వేరే దేశాల టెక్నాలజీ కోసం ఎదురు చూడకుండా సొంతంగా రీసెర్చ్ చేసి కొత్త టెక్నాలజీని డేవలప్ చేసింది. నవంబర్ 8 2008న విజయవంతంగా చంద్రయాన్-1 చంద్రుని కక్ష్యలో చేరింది. ఆ తరువాతి కాలం లో ISRO ఎన్నో ప్రాజెక్ట్స్ సైన్ చేసింది, 

           2020 -21 సంవస్చారాలలో లాంచ్ కావాల్సిన Chandrayaan-3  లాంచ్ మరియు భారతదేశం నుంచి మొట్ట మొదటిసారిగా మనుషులను అంతరిక్ష మిషన్ కోసం పంపించే Gaganyaan అనే ప్రాజెక్ట్ కూడా కోవిడ్ -19 మరియు లాక్డౌన్ కారణంగా డిలే అవుతూనే వస్తుంది. ఈ ప్రాజెక్ట్స్ 2022 నాటికి పూర్తవుతాయని ISRO చైర్మన్ Dr. K. Sivan తెలిపారు. ఈ Indian Human Spaceflight Programme  కోసం దాదాపుగా 10,000 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు. త్వరలోనే వీటితో పాటు చంద్రుడి మీదకు భారతదేశ వ్యోమగాములను సగర్వంగా పంపించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ. మీ ప్రభాకర్ రెడ్డి.

జై హింద్ !

How Does The Moon Glow? | & Facts About Moon and Earth | In Telugu | My Show My Talks,How Does The Moon Glow?,Facts About Moon and Earth,telugu videos,telugu fact videos,telugu facts,moonlight,how moon shines,why does the moon shine only at night,my show my talks,prabhakar reddy,Why is the moon so shiny tonight?,chandamama,Why moon shines white,What is the colour of Moon,moon telugu,moon facts telugu,facts about the moon,amazing facts about the moon in telugu

Why Does The Moon Glow | What Makes The Moon Shine? Moon Facts Why Does The Moon Glow | What Makes The Moon Shine? Moon Facts Reviewed by M. Prabhakara Reddy on May 26, 2021 Rating: 5

No comments

If you have any doubts please let me know.

Featured Post

Earn Passive Income for Life with EarnKaro’s Refer & Earn Program! (10% Lifetime Commission)

EarnKaro Refer & Earn - 10% Lifetime Commission Earn Passive Income for Life with EarnKaro ...

Ads Home

Travel everywhere!