Sahara Group Scam Full Story Explained | Sahara Scam | Case Study | SUbrata Roy
Sahara ఈ పేరు తో కోట్లాది మంది పేద మధ్య తరగతి ప్రజల జీవితాలు ముడి పడి ఉన్నాయి. ఒక వ్యక్తి ఇంటింటికి తిరుగుతూ స్నాక్స్ అమ్ముతు సహారా అనే పేరుతో వేల కోట్లు ఏ విధంగా సంపాదించగలిగాడు? క్రికెటర్స్ ని దేవుళ్ళ లా భావించే మన దేశం లో వాళ్ళు వేసుకునే జెర్సీ ల మీద సహారా అనే లోగో ను ముద్రించే స్థాయికి Subrata Roy ఎలా ఎదిగాడు? ఒకే వేదికపై తన ఇద్దరి కొడుకుల పెళ్ళిళ్ళ కోసం 2004 లోనే సుమారు 552 కోట్ల రూపాయలను మంచి నీళ్ళలా ఖర్చు చేసిన రాయ్ ఏ విధంగా ఈ స్థాయికి ఎదిగాడు మరియు ఒకే ఒక్కడిని నమ్మి కూలి పనులు చేసుకునే సగటు మధ్య తరగతి భారతీయులు ఒక్కొకరు వేలాది రూపాయలు ఎందుకు అతడి చేతులో పెట్టారు! 2004 లో జరిగిన అతడి కుమారుల పెళ్లిళ్లకు బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు అప్పటి ప్రైమ్ మినిస్టర్ కూడా హాజరయ్యారు అంటేనే మనం అర్ధం చేసుకోవచ్చు అతడు ఎక్కడనుంచి ఎక్కడి వరకు ఎదిగాడో అని. అటువంటి Subrata Roy యొక్క చీకటి కోణాలను ఈరోజు మీ ముందు ఉంచబోతున్నా.
Life Story-
1948 బిహార్ అరారియా లో జన్మించిన Subrata Roy Government Technical Institute, Gorakhpur, నుండి Mechanical Engineering పూర్తిచేసాడు. కాని తన తండ్రి మరణానంతరం కుటుంబ బాధ్యత తీసుకోవలసి వచ్చినప్పుడు జయ ప్రొడక్ట్స్ అనే పేరుతో తన లాంబ్రేటా స్కూటర్ పై ఇంటింటికి తిరుగుతూ salted snacks అమ్మే వాడు. పెద్దగా లాబాలు లేకపోయినా ఎదో వాళ్ళు బ్రతకడానికి కావలసిన డబ్బును సంపాదించేవాడు. ఆ తర్వాత భార్య సప్నా రాయ్‌తో కలిసి మరో వెంచర్ ను స్టార్ట్ చేశాడు. ఈ సారి మొత్తం రెండు ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఫెయిల్ అయ్యాయి.
1970's-80's సంవస్చారాలలో ఇప్పుడు ఉన్న విధంగా ఇన్ని బ్యాంక్స్ ఉండేవి కావు. ముఖ్యంగా విలేజెస్ లో ఉండే ప్రజలకయితే అసలు అవి అందుబాటులోనే ఉండేవి కావు. మాములూగా పేద మధ్యతరగతి వాళ్ళు అనుకునేది ఏంటి వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు ఇంట్లో దాచుకుంటే ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. అలా అని బ్యాంక్స్ లో వేసుకుందాం అంటే దాదాపు 6 గంటలు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. ఇదే రాయ్ కి మంచి అవకాశాన్ని కల్పించింది. సుబ్రతరోయ్ ప్లాన్ కూడా అదే, మారు మూల గ్రామాలలో బ్యాంకింగ్ వ్యవస్థ గురించి ఆ రోజుల్లో తెలిసే అవకాశమే లేదు. ఒక వేల తెలిసినా వారికి రోజు వచ్చే చాలీ చాలాని జీతాలను వదిలేసి ఎక్కడో దూరంగా ఉన్న బ్యాంక్స్ దగ్గరకు వెళ్లి డిపాజిట్ చేసుకునే అవకాసం కూడా వారికీ లేదు. ఇది మంచి అవకాశంగా రాయ్ కు కనిపించింది.
Sahara Startup-
అనుకునట్లుగానే 1978లో రాయ్ సహారాను స్థాపించాడు. గోరఖ్పూర్ లో పారా-బ్యాంకింగ్ వెంచర్ లా అక్కడి టీ-స్టాల్స్, రోజు వారి కూలీలు, మరియు రిక్షా-పుల్లర్స్ వంటి చిన్న పెట్టుబడిదారులనే లక్ష్యంగా చేసుకుని వారితో రోజుకు ఒక్క రూపాయి మాత్రేమే కట్టించుకుని, నెల చివరిలో వారు కట్టిన అమౌంట్ కు మంచి వడ్డీ ను ఇస్తూ వాళ్ళలో నమ్మకాన్ని మరియు పెట్టుబడిదారులను ఒకోక్కరిగా పెంచుకుంటూ కేవలం మూడు సంవస్చారల లోనే ఇది భారతదేశపు అతిపెద్ద రెసిడ్యూరీ నాన్-బ్యాంకింగ్ సంస్థగా ఎదిగింది.
మొదట్లో రూపాయితో స్టార్ట్ అయిన ఈ స్కీం కాదు కాదు ఈ స్కాం అలా కొంత కాలానికే ఒకోక్కరితో నెలకు పదులు వందలు వేల రూపాయలు కట్టించుకునే రేంజ్ కి నమ్మకాన్ని సంపాదించింది. బ్యాంక్స్ లో వచ్చే వడ్డీ కంటే సుబ్రత రాయ్ సహారా స్కీంలో అదిక వడ్డీ వస్తుండటంతో ఎవరు కూడా ప్రశ్నించేవారు కాదు. ఒక రకంగా చెప్పాలి అంటే పబ్లిక్ అందరు ఇది చిట్స్ లేదా బ్యాంక్స్ లలో ఉండే సేవింగ్స్ స్కీం లాంటిదే అని అనుకునేవారు. వారు సంతకాలు పెట్టె పేపర్స్ మీద ఏమి రాసి ఉందొ కూడా వాళ్ళకు తెలియదు. ఆరోజుల్లో నిరక్ష్యరాస్యత కూడా సహారా టీం కు బాగా కలిసివచ్చింది.
మొదట్లో వారానికి నెలకు కట్టించుకునే పద్ధతి కాకుండా ప్రతీ రోజు 10 రూపాయల దగ్గర మొదలు పెట్టి 50 - 100 రూపాయలు కూడా వసూలు చేసేవారు. వాళ్ళు సహరా లో కట్టే సొమ్ముకు 3 సంవస్చారలాలో డబల్ అవుతుంది అని చెప్పేవారు. నిజానికి అలా మనీ పే చేసిన వాళ్ళకు బ్యాంక్స్ ఇచ్చే దానికంటే భారీ రేంజ్ లోనే ఎక్కువ వడ్డీ వచ్చేది. ఇలా సుబ్రత రాయ్ తన క్రెడిబిలిటీ పెంచుకున్నాడు. రాయ్ ను ఇంటర్వూస్ లో మీరు ఎవరో కూడా తెలియని జనాలు ఏ నమ్మకంతో మీకు డబ్బులిచారు అని అడిగినప్పుడు, పేద మధ్యతరగతి వాళ్ళు ఎవరికీ కూడా సేవింగ్స్ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు, అలాంటి వాళ్ళు అందరితో నేను వాల్ల ఫ్యుచర్ ఎలా ఉంటుందో అర్ధమయ్యేలా చెప్పేవాడిని. ముఖ్యంగా ఏ ఫ్రెండ్షిప్ లోనయినా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇంటర్వ్యూర్ తో చెబుతాడు.
Sahara Growth-
ఇక్కడ ఇంకొక విషయం ఏజెంట్స్ గా ఉండే ఏ ఒక్కరికి కూడా శాలరీ అనేది ఉండదు. వారు జాయిన్ చేసిన మెంబెర్స్ ను బట్టి ఏజెంట్స్ కమిషన్ ఉంటుంది. ఎంత ఎక్కువ మందిని వాళ్ళు జాయిన్ చేస్తే అంత ఎక్కువ వాళ్ళు సంపాదించుకోవచ్చు. సుబ్రత రాయ్ ఈ కంపెనీ ని ఎలా portray చేసేవాడంటే ఇదంతా ఒక ఫ్యామిలీ కమ్యూనిటీ అని, ఇదంతా కూడా ఒకే ఫ్యామిలీ అని చెప్పుకోచ్చేవాడు. ఈ ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ తో ఇండియాన్స్ కు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. ఈ కాన్సెప్ట్ అనేది చాలా పవర్ ఫుల్ ఐడియా. మన దేశంలోని మారు మూల ప్రాంతానికి కూడా చేరుకోగలిగే చాలా సింపుల్ అండ్ చాలా ఎఫెక్టివ్ స్కీం ఇది. అందుకుకోసమే రాయ్ దీనిని The worlds largest family లేదా సహారా పరివార్ అని పిలిచేవాడు. దీనికోసమే సహారా advertisements లో ఇండియన్ కల్చర్ ప్రతిబింబించే విధంగా డిజైన్ చేసేవారు. దానిలో భాగంగానే సామూహిక వివాహాలు జరిపించి నూతన దంపతులకు లక్షల్లో కానుకలు ఇచ్చేవాడు.
Sahara Turned into Billion Dollar Company
ఆ విధంగా 1997 నాటికి ఈ కంపెనీ worth అక్షరాలా 1 బిలియన్ $ అమెరికన్ డాలర్స్ కు చేరుకుంది అని స్వయంగా సహారా ప్రకటించుకుంది. ఇది ఈ కంపెనీ వేల్యూ మాత్రమే. మరి మిగిలిన కొన్ని వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయి?
ప్రజలను మోసం చేసి వసూలు చేసిన డబ్బుతో ఎయిర్ సహారా ఎయిర్లైన్స్ ను స్టార్ట్ చేశాడు. అక్కడితో అది ఆగలేదు, రెండు ఐకానిక్ న్యూయార్క్ హోటల్స్ ను కొన్ని వేల కోట్లు కర్చు చేసి కొనుగోలు చేసింది సహారా గ్రూప్. Central Park మన్ హాటెన్లో ని luxury Plaza Hotel ను అప్పటి Saudi Arabia ప్రిన్స్ అయినటువంటి Alwaleed bin Talal దగ్గర నుంచి 575million US dollars తో 75% స్టేక్ ను కొనుగోలు చేశాడు. మరొక ఐకానిక్ హోటల్ అయిన New York’s Dream Downtown hotel లో 85% స్టేక్ ను విక్రమ్ చత్వాల్ group నుంచి $ 220 మిలియన్ US డాలర్స్ తో కొనుగోలు చేశాడు.
ఇప్పుడు మీకు చెప్పబోయే Sahara వెంచర్ గురించి మీరు వెంటే వామ్మో అని అనకుండా ఉండలేరు. అదే ది గ్రేట్ Aamby Valley మెగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. Aamby Valley సిటీ భారతదేశంలో మహారాష్ట్రలోని పూణే జిల్లాలో సహారా ఇండియా పరివార్ అభివృద్ధి చేసిన టౌన్ షిప్. ఈ ప్రాజెక్ట్ ను 10,600 ఎకరాల విస్తీర్ణం లో 2006 లో స్టార్ట్ చేసారు. ఇందులో మొత్తం 600-800 లగ్జరీ బంగ్లాలు ఉన్ట్టాయి. అవి ఒక్కొకటి ₹ 5 కోట్ల నుండి ₹ 20 కోట్ల మధ్య ధర ఉంటుంది. 2006 టైం లో 5 కోట్లు అంటే ఇప్పుడు ఆ బంగ్లా ఒక్కో దాని వేల్యూ 30 కోట్ల పైమాటే ఈ వ్యాలీ లో dams నిర్మించడం ద్వారా Three large man made lakes కూడా ఇక్కడ ఉన్నాయి.
ఇవే కాక fully functional airport, helipads, shopping complexes, 256 ఎకరాల PGA approved 18-hole golf course, captive power plant, ఒక international school, మరియు ఒక Multispeciality hospital. ఇవిమాత్రమే కాదు ఈ township లో multiple luxury restaurants మరియు సాంస్కృతిక కార్యక్రమాల కోసం వారణాసి ఘాట్ యొక్క ప్రతిరూపానికి ఆనుకొని ఒక artificial beach ఇలా మరెన్నో హంగులు ఆర్బాటాలు ఇక్కడ ఉన్నాయి.
ఇండియన్స్ కు అంటే మనకు క్రికెట్ అంటే ఒక మతం లాంటిది. అందుకే క్రికెటర్స్ ను ఒక గొప్ప స్థాయిలో ఊహించుకుంటాం. ఒక మతం లా చూసే ఈ క్రికెట్ కు దేవుళ్ళు ఈ ఆట ఆడే ఆ క్రికెటేర్సే. అందుకోసమే సుబ్రత రాయ్ అటువంటి ఇండియన్ క్రికెటర్స్ జెర్సీ మీద తన సహారా లోగో ఉంటె తన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి సహారా ఇండియన్ క్రికెట్ టీం కి ఆఫిషియల్ స్పాన్సర్ గా మారుతుంది. 2011 లో సహారా పూణే వారియర్స్ అనే టీం తో IPL లో అడుగుపెట్టింది. 2011 నుంచి 2013 వరకు గ్రాండ్ లెవెల్ లో perform చేసింది. క్రికెట్ తరువాత సహారా ఫోర్స్ ఇండియా పేరుతో ఫార్ములా వన్ టీం ను కొనుగోలు చేశాడు.
ఇప్పటివరకు చేసిన ఈ పోజేక్ట్స్ కు బిన్నంగా ఆ తరువాత సహారా వన్ అనే పేరుతో ఎంటర్టైన్మెంట్ టీవీ చానల్స్ ను స్టార్ట్ చేసి సక్సెస్ వైపు నడిపించాడు సుబ్రత రాయ్. దీనితో అతడు ఆగలేదు 360 ఎకరాలలో సహారా సిటీ పేరుతో ఒక సిటీ నే కట్టేశాడు. తనతో పాటు కొంతమంది సహారా employees అక్కడే మిగిలిన బిల్డింగ్స్ లో ఉండేవారు. కావలసిన దానికంటే ఎక్కువ డబ్బు ఎవరి దగ్గరయిన ఉంటె వాళ్ళకు వచ్చే నెక్స్ట్ థాట్ పవర్, అందుకనే అమెరికన్ ప్రెసిడెంట్ ఉండేటటువంటి వైట్ హౌస్ ను పోలిన ఒక బారి రేంజ్ బిల్డింగ్ ను కట్టించుకుని అందులోనే ఉండేవాడు రాయ్. అంటే ఇక్కడ పవర్ అనేది ఒక దేశాన్నో లేదా ప్రాంతాన్నో పాలించడం కాదు. ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో తన కింద వర్క్ చేసే అందరికి కూడా తానే ఒక దేవుడిలా అనిపించే ఒక ఫీలింగ్.
తన చుట్టూ ఎప్పుడూ అయితే బాగా రిచ్ పీపుల్ లేదా Glamourous కచ్చితంగా ఉండే లా చూసుకునేవాడు. దానికోసమే రెగ్యులర్గా పార్టీస్ ఇచ్చేవాడు. బాలీవుడ్ లో ది గ్రేట్ యాక్టర్ అంటే అమితా బచ్చన్ అనే చెబుతారు. అలాంటి బిగ్ బి మరియు సుబ్రత రాయ్ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు.
The Most Expensive Indian Wedding-
ఇక 2004 లో జరిగిన తన కొడుకుల పెళ్లిల్ల విషయానికి వస్తే అప్పటి ప్రైమ్ మినిస్టర్ , ఉత్తర ప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఇండియా లో ఉన్న అప్పటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్, ఇలా ఎంతో మంది సెలబ్రిటీస్ హాజరయిన ఈ వెడ్డింగ్ లో మొత్తంగా పది వేల మంది వరకు ఉన్నారట. ఈ ఫంక్షన్ కోసం అక్షరాలా 552 కోట్ల రూపాయలను మంచి నీళ్ళలా ఖర్చు చేసారు. అప్పటివరకు ఇండియన్ హిస్టరీ లోనే ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ వెడ్డింగ్ ఇదే అని రికార్డ్స్ చెబుతున్నాయి. ఇవన్ని చూస్తున్న పబ్లిక్ కి ఎక్కడో ఒక అనుమానం ఉంది. ఇంత డబ్బు రాయ్ కి ఎలా వస్తుంది అని. కాని అలంటి వ్యక్తిని అడిగే ధైర్యం ఎవరు చేస్తారు? అడగాలని ఉన్న ఎవరు కూడా పట్టించుకోరు.
Sahara Downfall-
కొంతకాలానికి రెగ్యులర్గా ఇంటికి వచ్చి చిట్స్ అమౌంట్ కట్టించుకునే ఏజెంట్ ఇక రారు అని, డిపాజిట్ చేసే వ్యక్తే రోజూ ఎక్కడో టౌన్ లో ఉన్న సహారా ఆఫీస్ కు వెళ్లి డిపాజిట్ చేయాలి అని చెప్పేవారు. అసలు సహారా స్టార్ట్ అయిందే దూరంగా ఉన్న బ్యాంక్స్ కు వెళ్లి బ్యాంకు లో డబ్బు డిపాజిట్ చేయలేక. రోజు కూలీ కి వెళ్ళేవాళ్ళు కనుక అంత దూరం వెళ్ళలేక డబ్బులు కట్టలేకపోయేవారు. Intime లో జరగాల్సిన పేమెంట్స్ ఆగిపోయేసరికి, మనీ పే చేయకపోతే ఇప్పటివరుకు పే చేసిన అమౌంట్ ను మీకు తిరిగి ఇవ్వలేము అని, మీ అమౌంట్ అంతా కోల్పోతారు అని నోటీస్ లు సెండ్ చేసారు. పబ్లిక్ కు ఇదంతా ఎదో fraud లా అనిపించడం మొదలయింది. ఇటువంటి పిరమిడ్ స్కామ్స్ అన్ని కూడా మనీ రేగులర్గా రొటేట్ అవుతూ ఉంటేనే సర్వైవ్ అవ్వగలరు. జనాల్లో అవేర్నెస్ పెరిగి కొత్తగా ఈ స్కీం లో జాయిన్ అయ్యేవాళ్ళకు ఇది సేఫ్ కాదు అని చెప్పడం మొదలవుతుంది. దాంతో ఎవరు కూడా మనీ కట్టేవారు కాదు. కొత్తగా వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా అక్కడితో ఆగిపోతాయి.
సహారా అనే సంస్థ పతనం మొదలయింది ఇక్కడే. ఆ టైంలో బయట నలుగురు కలిస్తే మాట్లాడుకునే ఒకే ఒక్క టాపిక్ సుబ్రత రాయ్ అండ్ సహారా మోసం గురించి మాత్రమే. అప్పటి ఇండియా జనాభా లో ప్రతీ 17 మందిలో ఒకరు సహారా స్కీం లో జాయిన్ అయినవారే. ఈ రూమర్స్ కు చెక్ పెట్టడం కోసం ఒక ఇంటర్వ్యూ లో 6 కోట్లకు పైన depositors ఉన్నారు అని వాళ్ళ అందరి బాధ్యత మొత్తంగా తనదే అని చెప్పుకొస్తాడు. ఈ ఇంటర్వు లో రాయ్ సహారా కంపెనీస్ లో మరో మేజర్ ప్రైవేట్ కంపెనీస్ అయిన హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ డొమైన్ లోకి వెళ్తుంది అని మరో 6 నెలల్లో కంపెనీ షేర్స్ ను స్టాక్ ఎక్స్చేంజ్ పబ్లిక్ సెక్టార్ కిందకు తేసుకోస్తునాం అని చెబుతాడు.
IPO and DRHP-
ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టెడ్ కంపెనీస్ గా మారిన తరువాత Securities and Exchange Board of India కంపెనీ కి సంబంధించిన అనేక విషయాలు పరిగణలోకి తీసుకున్ట్టారు. వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ కంపెనీ ఫండ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి, వాటిని ఎలా యూజ్ చేస్తున్నారు, కంపెనీ ఆడిట్ అకౌంట్స్, ఇలా అనింటిని సేబి చూసుకోవలసి ఉంటుంది. ప్రజల్లో మొదలయిన ఆందోళనతో ఈ లెక్కలు అన్ని తప్పు అని పబ్లిక్ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసారు. అప్పుడు సెబి ఎంటర్ అవుతుంది. సెబి హెడ్ క్వార్టర్స్ కు సుబ్రత రాయ్ ను పిలిపించి సుబ్రత రాయ్ ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇన్వెస్టర్స్ డీటెయిల్స్, మరియు మనీ రిటర్న్ చేసే టైం అండ్ డేట్, రిటర్న్ పోలసీస్ కు సంబందించిన డీటెయిల్స్ వంటివి కరెక్ట్ గా లేవంటుంది సెబి. అలా మొదలయింది సహారా పతనం.
Sahara India vs SEBI-
SEBIఆరోపణల ప్రకారం సహారా గ్రూప్స్ కు చెందిన అన్ని కంపెనీస్ కలిపి మొత్తంగా 3.5 బిలియన్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ 24 వేల కోట్లు ఇన్వెస్టర్స్ దగ్గర నుండి ఇల్లీగల్ గా collect చేసింది అని చెప్పుకొస్తుంది. అప్పటివరకు నోరు మెదపని ఇండియన్ Print media and electronic media సెబి ఎంటర్ అయిన తరువాత నుంచి రెగ్యులర్ టీవీ న్యూస్ డిస్కషన్స్ మరియు రెగ్యులర్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ప్రింట్ చేయడం స్టార్ట్ చేస్తాయి.
ఇండియన్ లా ప్రకారం ఏదయినా కంపెనీ ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తే, వాళ్ళు స్టాక్ మార్కెట్ regulations కు లోబడి ఉండాలి. సుబ్రత రాయ్ మాత్రం టెక్నికల్ గా ఇది పబ్లిక్ ఇష్యూ కాదని, సహారా ఇన్వెస్టర్స్ అందరూ కూడా సహారా కుటుంబంలో భాగమైన వ్యక్తులు కాబట్టి, పూర్తిగా ఇది ప్రైవేట్ మేటర్ కిందకు వస్తుంది అని చెప్పుకొస్తాడు. కాని మేటర్ ఏంటంటే సుమారు 3 కోట్ల మంది ఇన్వెస్టర్స్ ఇందులో ఉన్నారు. ఇండియన్ హిస్టరీ లో అంతవరకు కూడా ఇంత మంది ప్రజలను నమ్మించి మోసం చేసిన స్కాంలలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ ఇదే.
Sahara India vs SEBI & Supreme Court -
కోర్ట్ మరియు సెబి ఎన్ని సార్లు వార్న్ చేసిన సుబ్రత రాయ్ ఇది పబ్లిక్ ఇష్యూ కానే కాదు అని చెబుతున్దడంతో, 2012 ఆగష్టు 31 న దీనిని పబ్లిక్ ఇష్యూ గా డిక్లేర్ చేసి, ఇల్లీగల్ గా రైజ్ చేసిన అమౌంట్ ను అక్షరాలా ₹ 25,700 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాల్సింది గా కోర్ట్ తీర్పునిచింది. ఇండియా మొత్తం లో ఒక కేస్ లో ఇంత పెద్ద భారి Penalties విధించడం ఇదే మొదటిసారి. ఇక్కడే రాయ్ తన తెలివితేటలు చూపించాడు. తీర్పు రావడానికి ముందే ఇన్వెస్టర్స్ తో ప్రెసెంట్ స్కీం లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి, ఆ అకౌంట్ హోల్డర్స్ అమౌంట్ అంతటిని వేరే స్కీం లోకి రీ ఇన్వెస్ట్మెంట్ చేయించమని ఏజెంట్స్ తో చెబుతాడు. రికార్డ్స్ ప్రకారం ఈ స్కీంస్ ఇన్వెస్టర్స్ అందరికి కోర్ట్ ఆర్డర్స్ కంటే ముందే ప్రతీ ఒక్కరికి మనీ రిటర్న్ చేసేసామని ఇక పే చేయాల్సింది ఏమి లేదని ప్రూఫ్స్ చూపిస్తుంది సహారా.
ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే సహారా లో ఉన్న టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ ను వేరొక కొత్త స్కీం లోకి మార్చడం, అది మాత్రమే కాకుండా ప్రతీ ఇన్వెస్టర్ కి క్యాష్ రూపాన మనీ రిఫండ్ చేసినట్లు చెప్పుకొస్తుంది సహారా. ఈ రిపోర్ట్ చూడగానే సెబి చైర్మన్ అయినటువంటి U. K. Sinha ప్రెస్ మీట్ లో ఒక రేంజ్ లో ఫైర్ అవుతారు. ఇండియా లోనే అతి పెద్ద కంపనీలలో ఒకటయిన సహారా అన్ని వేల కోట్లు, పైగా 90 శాతానికి పైన క్యాష్ రూపాన ఎలా ఇచ్చింది, వీటికి సుబ్రతా రాయ్ సమాధానం చెప్పి తీరాలి అని సెబి డిమాండ్ చేస్తుంది. ఇదే విషయాన్నీ రాయ్ ని అడిగినప్పుడు దీనికి కౌంటర్ గా, కావాలంటే ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, ఇంకా కావలంటే ఇన్స్పెక్షన్ చేసుకోండి, మాదంతా ఓపెన్ బుక్ అంటూ చెప్పుకొస్తాడు.
అయితే కోర్ట్ అండ్ సెబి ఇద్దరు కూడా ఆ క్యాష్ ను ఏవిధంగా రిఫండ్ చేసారు వంటి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ను సబ్మిట్ చేయాల్సిందిగా ఆర్డర్స్ పాస్ చేసారు. సహారా టీం వెంటనే ఆ రాత్రికి రాత్రే టోటల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేస్తుంది. జస్ట్ ఇమాజిన్ 127 ట్రక్స్ లలో, 31వేల బాక్స్ లు, కొట్లలో పేపర్ డాక్యుమెంట్స్, ఒక అర్దరాత్రి ముంబై లోని Securities and Exchange Board of India హెడ్ క్వార్టర్స్ కు పంపిస్తే అక్కడ వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు. ఇదంతా కూడా సహారా ప్లాన్ లో భాగమే. ఈ డాకుమెంట్స్ అన్నింటిని వెరిఫై చేయడానికి ఎన్నో సంవస్చారాలు టైం పడుతుంది.
ఇక్కడ సహారా చెప్పుకొచ్చింది ఏంటంటే మీకు పంపించిన ఆ 5 కోట్ల డాకుమెంట్స్ లోనే మా నిజాయితీని నిరూపించే డాక్యుమెంట్స్ ఉన్నాయి అని. వాటిలో ఇన్వెస్టర్స్ పేర్లు ఒక బాక్స్ లో ఉంటె వాల్ల రిఫండ్ కు సంబందించిన డాక్యుమెంట్స్ వేరొక బాక్స్ లో ఉండేలా ముందుగానే సెట్ చేస్తారు. దానితో పాటు ఇంతకు ముందు సెబి కి సబ్మిట్ చేసిన డిపోసిటేర్స్ పేర్లు, ఈ డాక్యుమెంట్స్ లో ఉండే పేర్లు అసలు ఏవిధంగాను మ్యాచ్ అవ్వడం లేదు. వెరిఫికేషన్ ప్రాసెస్ ను మరింత లేట్ చేయాలని కావాలనే ఇలా పంపించారు.
వాటిలో ఉండే కొంతమంది పేర్లు అడ్రెస్స్ లు కూడా ఆల్మోస్ట్ రెండు మూడువేల సార్లు రీపీటెడ్ గా ఉన్నాయట. కామెడీ ఏంటంటే మరికొంతమంది పేర్లయితే ఏకంగా ఇండియాలో ఉన్న సిటీస్ పేర్లనే పెట్టేసారు. అంటే పర్సన్ నేమ్ రామా రావు, క్రిష్ణా రావు కాకుండా, విజవవాడ విశాఖపట్నం అనే పర్సన్స్ వాళ్ల ఇన్వెస్టర్స్ అని వాటిలో చూపించారట. మరి అవి ఫేక్ కాకా ఇంకేమనుకున్ట్టారు.
ఇంత క్లిష్ట పరిస్థితులలో కూడా సెబి ఆ లిస్టు లోనుంచి 20 వేల మంది డిపోసిటేర్స్ కు లెటర్స్ రాయగా కేవలం 68 మంది మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి సెబి కి రిటర్న్ లెటర్స్ రాశారు. ఇదే విషయాన్ని అర్నబ్ గోస్వామి సుబ్రత రాయ్ ని అడగగా, వాలందరూ మిడిల్ క్లాస్ పర్సన్స్, పైగా వాళ్ళందరికీ వాల్ల మనీ రిటర్న్ అయిపోయాక తిరిగి ఎందుకు వాళ్ళు సెబి కి రెస్పాండ్ అవుతారు అని రిప్లై ఇస్తాడు సుబ్రత రాయ్.
ఇదంతా గమనిస్తున్న గవేర్నమెంట్ ఏజేన్సీస్, మరియు మీడియా బ్లాక్ మనీ, మరియు మనీ లాండరింగ్ చేస్తున్నారా అంటూ అడగడం మొదలు పెడతాయి. వీళ్ళతో పాటు పబ్లిక్ కూడా సహారాను క్వశ్చన్ చెయ్యడం స్టార్ట్ చేస్తారు. వీటికి చెక్ పెట్టడం కోసం, అన్ని న్యూస్ పేపర్స్ లోను సెపరేట్ గా ఎమోషనల్లి స్పీకింగ్ అని ఒక page నే ప్రింట్ చేయిస్తాడు. ఎవరయినా సరే తన మీద ఉన్న ఆరోపణలను ప్రూవ్ చేయగలిగితే ఉరిసిక్షకు రెడీ అంటూ స్టేట్మెంట్ ఇస్తాడు.
ఎంత చేసిన పబ్లిక్ లో సానుభూతి సంపాదించలేకపోయాడు. ఆకరిగా తన దగ్గర మిగిలి ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే రోజు రానే ఒచ్చింది. May 6 2013న Lucknow లో 121,653 మంది సహారా ఉద్యోగులతో తో కలిసి national anthem పాడుతారు. ఈ విధంగా చేయడానికి ముఖ్య కారణం తాను దేశంలో అందరికంటే గొప్ప దేశభక్తుడు అని ప్రజల్లో నిరూపించుకోవడం కోసం. అప్పటికే పబ్లిక్ సుబ్రత రాయ్ మాటలు నమ్మడం చాల వరకు మానేశారు. కాని ఇంతమంది ఒకే ప్లేస్ లో మన జాతేయగీతం ఆలపించినండుకుగాను Guinness World Records లో ప్లేస్ కూడా సంపాదించారు. ఇలా మరో రెండు రకాల Guinness World Records సహారా పేరు మీద ఉన్నాయి. అదంతా వేరే విషయం అనుకోండి.
ఛాన్స్ దొరికినప్పుడల్లా గవర్నమెంట్ అఫీషియల్స్ ను వాళ్ళంతా ఉనిఫాం వేసుకున్న గూండాలు అని అనేక ఇంటర్వూస్ లో చెప్పుకోచ్చేవాడు. ఈ విధంగా చాల రోజులు గడిచిపోయాయి, కాని సుబ్రత రాయ్ ఒక్క రూపాయి కూడా ఎవరికీ రిటర్న్ చేయలేదు అని పబ్లిక్ లో తిరిగుబాటు స్టార్ట్ అయింది, కోర్ట్ హీరింగ్స్ కు కూడా హాజరు కాకుండా ఏవేవో సాకులు చెప్పుకొచ్చేవాడు.
Subrata Roy Arrest-
ఒకసారయితే ఏకంగా అనారోగ్యంతో భాదపడుతున్న తన 92 సంవచ్చరాల తల్లి దగ్గర తానే ఉండాల్సిన పరిస్థితి అని, ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది అని, తల్లికంటె ఏది ఎక్కువ కాదు కాబట్టి, కోర్ట్ హియరింగ్స్ ను వాయిదా వేస్తూ సుబ్రత రాయ్ కు కొంత సమయం ఇవ్వాల్సిందిగా అతని లాయర్ కోర్ట్ ను కోరుతాడు.
కర్రెక్ట్గా అదే రోజు రాత్రి లక్నో లో ఒక పెళ్ళికి వెళ్లి అడ్డంగా దొరికిపోతాడు. ఆ మరుసటి రోజు ఉదయం లక్నో టైమ్స్ అనే లోకల్ న్యూస్ పేపర్ లో ప్రింట్ అయిన ఫొటోస్ ను చూసి contempt of court క్రింద పరిగణించి వెంటనే అరెస్ట్ వార్రెంట్ ఇష్యూ చేస్తుంది కోర్ట్. నిజానికి కోర్ట్ ఆర్డర్ చేసిన అమౌంట్ ని పే చేసేసి ఉంటె సుబ్రత రాయ్ దగ్గరా ఇంకా ఎన్నో వెల కోట్లు ఉండేవి, పైగా అరెస్ట్ అవ్వాల్సిన పని కూడా ఉండేది కాదు.
సింపుల్ గా అంత డబ్బు వెనుక ఉన్నతరువాత మనల్ని ఎవరు ఎం చేస్తారులె అని పెద్దగా పట్టించుకోలేదు సుబ్రత రాయ్. అరెస్ట్ తరువాత డైరెక్ట్ గా తీహార్ జైల్ కు తీసుకువెళ్ళారు. ఏజెంట్స్ కు కాని ఇన్వెస్టర్స్ కు కాని ఇన్ని సంవస్చారాలు అయిన ఇంకా చాలా మందికి మనీ రిటర్న్ అవ్వని వాళ్ళు లక్షల్లో ఉన్నారు.
జైల్ లో ఉన్న్డగా బైల్ తో బయటకు రావడానికి చేయాల్సిన విశ్వ ప్రయత్నాలు అన్ని చేశాడు. అతనికి తన వల్ల తన కంపెనీ వల్ల లక్షల మంది రోడ్డున పడటం బాధ కలిగించడం లేదు. జైల్ లో తాను బరువు పెరుగుతున్నాడని బాధగా ఉందట. తెలుసా ప్రతీ రోజు ఉదయం ఒక యోగ ఇన్స్ట్రక్టర్ జైలుకు వచ్చి ఆసనాలు చేయిన్చేవారట.
మరొక బీభత్సమైన విషయం ఏమిటంటే ఈ రెండు సంవచ్చరాలలో జైల్ ఉంటూ మొత్తం 3 బుక్స్ ను రాసేశాడు సుబ్రత రాయ్. ఫైనల్ గా 2016 మే 6న తీహార్ జైల్ నుంచి పెరోల్ మీద రిలేజ్ అయ్యాడు. సుప్రీంకోర్టు డిమాండ్స్ ప్రకారం సహారా కంపెనీ కి సంబందించిన కొన్ని ఆస్తులను అమ్మేసి 2.1 బిలియన్ dollars ను రైజ్ చేస్తుంది. సెబి అండర్ లో పబ్లిక్ కంపెనీస్ గా లిస్టెడ్ అయిన సహారా కు సంబందించిన రెండు కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసిన 30 లక్షల మంది ఇన్వేస్తేర్స్ రెస్పాన్సిబిలిటీ మొత్తం సెబి దే.
999
మిగిలిన సహరా స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఎవరు కూడా సుప్రీంకోర్టు రులింగ్ కిందకు రారు. వారిలో ఒక్కరివి ఒక్క రూపాయి కూడా కోర్ట్ కాని సెబి ది కాని బాధ్యత కాదు. రికార్డ్స్ ప్రకారం official or un-official గా ఇంకా ఎన్నో లక్షల మంది సహారా లో ఇన్వెస్ట్ చేసి రోడ్డున పడ్డారు. ఇంత జరిగినా కూడా ఇంకా సుబ్రత రాయ్ ను నమ్మే వాళ్ళు ఉన్నారు అంటే మీరు నమ్మగలరా. ఎస్ ఇంకా ఉన్నారు. ఇప్పటికి నమ్ముతూనే ఉన్నారు.
ఇప్పటికీ అతడే సహారా కంపెనీ కి చైర్మన్. ఇటీవల కాలంలో వాల్లే తమ కంపెనీ 9.4 బిలియన్ డాలర్స్ వేల్యూ అని క్లెయిమ్ చేసుకున్నారు. వీటిలో మోస్త్లీ క్యాష్ రూపనకంటే లాండ్స్ మరియు ప్రాపర్టీస్ లలోనే ఎక్కువ వేల్యూ చేస్తాయి. మరికొన్ని వేలు లక్షల కోట్ల స్కామ్స్ మన మీడియా పెద్దగా చూపించనివి చాలానే ఉన్నాయి. ఆ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ను subscribe చేయడం మాత్రం మర్చిపోవద్దు.
ఈ ఆర్టికల్ Netflix లో రిలీజ్ అయిన bad boy billionaire in india అనే web series లోనుంచి రాసిన స్క్రిప్ట్స్. విసువల్ గా చూడాలి అని అనుకుంటే Netflix లో చూడండి.
జైహింద్.
satyam scam explained,tech mahindra,telugu,scam,india's biggest political scam,case study,dmk,news,shares,spectrum,facts,exxplanation,mind blowing facts,sahara scam,sahara india pariwar,subrata roy scam,subrata roy,my show my talks,Sahara Scam Full Story Explained,Biggest Scam In Indian History,Sahara Scam Full Story Explained | Biggest Scam In Indian History In Telugu | Subrata Roy | Sahara,sahara group,biopic,sebi and subrata roy,top,top indian scams

No comments
If you have any doubts please let me know.