Who is No 1 | Top 15 Telugu YouTube's | Telugu top YouTube stars & channels 2021
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి YouTube గురించి తెలియదు అన్నారు అంటే వాళ్ళని చాల గొప్పవాళ్ళుగా చూడొచ్చు, ఒక వేల స్మార్ట్ ఫోన్ ఉండి YouTube లో ఈ వీడియో చూస్తున్నారు అంటే వాళ్ళు ఇంకా గోప్పవాలు. ఇక్కడ చూసే డివైస్ ఇంపార్టెంట్ కాదు చూస్తున్న platform ఇంపార్టెంట్. మన అందరికి తెలుసు సోషల్ మీడియా ఎవరినయిన రాత్రికి రాత్రి సెలెబ్రిటి ని చేసేయోచు. అదే రాత్రి వెరే ఎవరినయిన రోడ్ మీదకు తీసుకువచేయొచ్చు. తప్పుగా అనుకోకండి నేను చెప్పేది తప్పు చేసినవాళ్ళ గురించి.
యూట్యూబ్ అనేది వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్, ప్రతి నిమిషం దాదాపు 300 గంటల నిడివి గల వీడియోస్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతాయి. రోజులో ఒక్క నిమిషం లో అప్లోడ్ అయిన వీడియోస్ ను మనం చూడాలి అంటే పంనేడున్నర రోజుల సమయం పడుతుంది. అందుకనే యూట్యూబ్ ను గూగుల్ తరువాత రెండవ అతిపెద్ద సెర్చ్ ఇంజన్ అని కూడా పిలుస్తారు. మూవీ రివ్యూస్ దగ్గరనుంచి ఇంట్లో ఉస్ చేసే AC refrigerator, టీవీ , సెల్ ఫోన్స్ ఇలా మన రోజు వారి లైఫ్ లో మన అవసరాలు తీర్చే అనేక రకాలకు సంబంధించి వేలు లక్షల వీడియోస్ ఈ YouTube లో ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఉన్ట్టాయి.
ఏ చిన్న డౌట్ వచిన్నా అది వంటలకు సంబంధించి కావచ్చు లేదా airplane repairస్ కావచ్చు ఇలా మనకు కావలసిన ప్రతీ ఆన్సర్ YouTube లో వీడియో తో సహా మన కల్ల ముందు ఉంటుంది. trending టాపిక్స్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ స్టూడెంట్స్ అయితే వారి knowledge ను మరింత పెంచుకోవడానికి ఈ YouTube ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రపంచంలో ఉన్న అల్ల్మోస్ట్ ప్రతీ లాంగ్వేజ్ లోను ఈ వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉన్ట్టాయి.
ఇక మన టాపిక్ విషయానికి వస్తే అలాంటి బాషలలో ఒకటయిన మన రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి తెలుగు లాంగ్వేజ్ లో టాప్ 15 youtubers గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఒక చిన్న విషయం ఈ టాప్ 15 లిస్టు లో న్యూస్ చానల్స్, ETV Jabardasth, mallemaala మరియు టి సిరీస్ , ఆదిత్య మ్యూజిక్, mango వంటి music channels ఇలాంటి చానల్స్ అన్నింటిని కూడా ఈ లిస్టు లో ఆడ్ చేయలేదు. ఎందుకంటే ఇలాంటి YouTube చానల్స్ అన్ని కూడా ఇండిపెండెంట్ చానల్స్ కాదు కాబట్టి ఈ లిస్టు నుంచి ఇటువంటి వాటిని తొలిగించడం జరిగింది.
ఇక్కడ మీరు అర్ధం చేసుకోవలసిన ఇంకొక విషయం ఏమిటంటే. ఇక్కడ చూడబోయే ranks అన్ని కూడా viewership మరియు subscribers తో పాటు వారు అందించే కంటెంట్ ను బేస్ చేసుకుని ఇచ్చిన rankings మాత్రమే. ఇందులో నా favorite చానల్స్ ని కూడా తక్కువ ranks లో చూపించడం జరిగింది. దానికి కారణం ఆ చానల్స్ కు ఉన్న వ్యూస్ మాత్రమే. బహుసా మీకు ఎంతగానో ఇష్టమయిన youtubers లేదా YouTube చానల్స్ కూడా ఫస్ట్ ప్లేస్ లో లేకపోవచ్చు. అందుకనే మీరు డిస్సపాయింట్ కాకూడదు అని ముందుగానే చెబుతున్నా.
మీకు నచ్చిన లేదా మీరు మెచ్చిన ఛానల్ నేమ్ ను కూడా కింద కామెంట్ లో రాసి దానితో పాటు ఒక లైక్ కూడా వేసుకోండి.
15) Pakkinti Kurradu -
పది లక్షల 50 వేలకు పైన subscribers తో 15వ ప్లేస్ లో PK పక్కింటి కుర్రాడు అనే షార్ట్ ఫిల్మ్ బేస్డ్ కంటెంట్ చానెల్ యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. నిజజీవితంలో ప్రతీ వ్యక్తి తన లైఫ్ లో అనుభవించే సంఘటనలను స్టొరీ లైన్ గా తీసుకుని వారి ఆడియన్స్ కి చాలా తక్కువ టైం లో వారి మనసుకు నచ్చే విధంగా ఈ ఛానల్ లో వీడియోస్ ఉన్ట్టాయి. Concept దగ్గరనుంచి ,Written & Direction అంతే కాకుండా ఈ షార్ట్ ఫిలిమ్స్ లో హీరో లేదా మెయిల్ లీడ్ రోల్ కూడా అన్ని చేసేది Chandoo Sai. సమాజం పట్ల తోటివారి పట్ల తనకున్న గౌరవాన్ని తన వీడియోస్ ద్వారా అందరికి అర్ధమయ్యేలా చెప్పడంలో తనలో నాకు ఒక మంచి డైరెక్టర్ కనిపిస్తాడు. ఈ ఛానల్ వ్యూస్ విషయానికి వస్తే కేవలం 118వీడియోస్ కు గాను 106 మిలియన్ వ్యూస్ ను ఇప్పటివరకు తన కాతాలో వేసుకుంది ఈ ఛానల్.
14) Real Mysteries -
సుమారుగా 9 లక్షల subscribers తో రియల్ mysteries అనే YouTube ఛానల్ ఎంటర్టైన్మెంట్, ఫాక్ట్స్ ,సైన్స్, spiritual, ఇలా ప్రతీ టాపిక్ లోను వీడియోస్ చేస్తూ , వీడియోస్ narration లో తమదయినా ముద్ర వేసుకున్న ఛానల్ ఈ రియల్ mysteries. కేవలం 128 వీడియోస్ కు గాను 119m వ్యూస్ ను సంపాదించారు.
13) Telugu TechTuts -
తెలుగు టెక్ న్యూస్ ఇష్టపడే ప్రతీ ఒక్కరికి తెలిసిన తెలుగు ఛానల్ Telugu TechTuts.సుమారుగా గత 7 సంవస్చారాల నుంచి హాఫిజ్ అనే youtuber తో నడుపబడే ఈ ఛానల్ లో టెక్ న్యూస్ ఒక్కటే కాదు C, C++,java, oracle, AutoCAD, advanced excel ఇలా ఈ టెక్ వరల్డ్ లో ఉస్ అవ్వే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ స్ దగ్గరనుంచి unboxing, మరియు reviews ,ఇలా టెక్నాలజీ ని బేస్ చేసుకునే అన్ని రకాల వీడియోస్ ఈ ఛానల్ చూడచ్చు. ఒక సాధారణ వ్యక్తిగా STD బూత్ లో నెలకు 500రూపాయల జీతం దగ్గర నుంచి తన ప్రయాణం మొదలు పెట్టి ఇప్పుడు ఇలా మన టాప్ 15 లిస్టు లో నిలిచారు. నిజం చెప్పాలి అంటే ఈ Syed Hafiz గారి లైఫ్ స్టొరీ ఒక మూవీ ల అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఛానల్ సంపాదన లక్షల్లోనే ఉంది. తన తెలుగు టెక్ ఛానల్ కు గాను 2017 lo Amaravati లో జరిగిన social media summit awards లో best technology content creator గా award కూడా అందుకున్నారు హఫీజ్. ఈ ఛానల్ 1.2 మిలియన్ subscribers మరియు 137 మిలియన్ వ్యూస్ తో 13th ప్లేస్ లో ఉంది.
12) Telugu badi -
మీరు YouTube లో ఫాక్ట్స్ టాప్ ఇంటరెస్టింగ్ వీడియోస్ లాంటివి తెలుగులో చూసి ఉంటె అందులో కచ్చితంగా ఈ తెలుగు బడి వీడియోస్ ఉండి తీరతాయి. biographies దగ్గర మొదలుపెడితే ఫాక్ట్స్ హెల్త్ mysteriesఇలా ఆల్మోస్ట్ మనకు తెలియని ఎన్నో టాపిక్స్ మీద వీడియోస్ ఈ ఛానల్ లో ఉన్ట్టాయి. ఈ ఛానల్ రామ కృష్ణ గారిచే నడపబడుతుంది. ఇన్ని మిలియన్ వ్యూస్ సంపాదించిన ఈ వీడియోస్ లో వచ్చే వాయిస్ వెనుక ఉన్న వ్యక్తిని ఒక్కసారి అయిన స్క్రీన్ ముందు చూడాలి అని చాలా మంది కోరుకుంటున్నారు. అందులో నేను ఒకడిని. అందుకే ఇలాంటి కంటెంట్ provide చేస్తున్న ఈ ఛానల్ ని వారి subscribers అందరు ముద్దుగా encyclopedia అని కూడా పిలుచుకున్ట్టారు. YouTube లో ఎదగడానికి advanced కంప్యూటర్స్ heavy equipment ఏమి కూడా అవసరం లేదు అని తన స్మార్ట్ ఫోన్ లోనే వాయిస్ ఓవర్ ఇచి అదే ఫోన్ లో వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసే వారు రామకృష్ణ . టోటల్ గా 1.32 మిలియన్ subscribers తో 125 మిలియన్ టోటల్ వ్యూస్ తో ఈ ఛానల్ 12 వ ప్లేస్ లో ఉంది.
11) Dhethadi - 165m
Catchy video content ని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు తమ ఆడియన్స్ కు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూ దేతడి ఛానల్ అతి తక్కువ టైం లోనే 1.17m మిలియన్ subscribers ను సంపాదించారు. 2018 లో స్టార్ట్ అయిన ఈ ఛానల్ కి కేవలం 2 సమవస్చారాలలోనే 1.17 మిలియన్ subscribers మరియు 166 మిలియన్ వ్యూస్ తో మన లిస్టు లో 11వ ప్లేస్ లో ఉంది.
10) Prasadtech in telugu -
Unboxing, mobile reviews, Wolrd tech news, gadget reviews, ఇలా ప్రతీ టెక్నాలజీ రిలేటెడ్ కంటెంట్ ను తమ ఆడియన్స్ కు genuine content ను provide చేస్తూ ఇంగ్లీష్ టెక్ చానల్స్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా డైలీ updates అందిస్తూ నిరంతరం వీడియోస్ అప్లోడ్ చేస్తూ కేవలం 4 సంవస్చారాల కాలంలో ఇరవై ఒక్క వందల కు పైన వీడియోస్ కు గాను 209 మిలియన్ వ్యూస్ సంపాదించి 1.13 మిలియన్ subscribers తో 10 వ ప్లేస్ లో ఉంది.
9) Arun Surya Teja -
లేటెస్ట్ trending టాపిక్స్, current affairs, ఇలా మోస్ట్ ఇంటరెస్టింగ్ టాపిక్స్ తో వీడియోస్ చేస్తూ అతి తక్కువ కాలం లోనే 1 మిలియన్ మైల్ స్టోన్ ను రీచ్ అయింది ఈ ఛానల్. అరుణ్ సూర్య తేజ తను b.tec లో ఉన్న టైం లోనే ఈ ఛానల్ ను స్టార్ట్ చేసాడు. మాములుగా ఫేస్బుక్ YouTube ఇలా ఏదయినా సోషల్ మీడియా లో మన ఫొటోస్ లేదా వీడియోస్ ను ఎవరన్నా ఎక్కువ షేర్స్ చేసిన లైక్ చేసిన creators చాల హ్యాపీగా ఫీల్ అవుతారు. అది ఒక కంటెంట్ క్రియేటర్ మాత్రమే అనుభవించే happiness. అలాంటిది అరుణ్ సూర్య తేజ 3capitals issueమీద చేసిన వీడియో ను ఒక స్టేట్ EX CM షేర్ చేస్తే ఎలా ఉంటుంది. అవునుTDP ప్రభుత్వ హయ్యాం లో cm గా ఉన్న నారా చంద్ర బాబు నాయుడు ఈ ఛానల్ లో వచ్చిన ఈ 3కాపిటల్ ఇష్యూ వీడియోను తన official ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసారు. ఈ ఛానల్ లో ఇప్పటివరకు 1.16 మిలియన్ subscribers తో 121 వీడియోస్ కు గాను 114 మిలియన్ వ్యూస్ తో 9th ప్లేస్ లో నిలిచింది.
8) vikramadithya-
ఈ నేమ్ తెలియని youtuber ఉండడు. నాకు తెలిసి ఈ ఛానల్ వచ్చిన తరువాత చాల మంది YouTube లో వాల్ల సొంత చానల్స్ ను స్టార్ట్ చేసేలా inspire చేసిన వ్యక్తి విక్రమాదిత్య. తను ఏ టాపిక్ తీసుకున్న సరే వీడియో ending వరకు ఆడియన్స్ ను కట్టిపడేసేలా ఉంటుంది తన narration స్టైల్. ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ తో పాటు కొంచం knowledge ను కూడా ఈ ఛానల్ అందిస్తుంది అనడంలో సందేహం లేదు. YouTube లో తన ఆడియన్స్ knowledge పెంచడం ఒక్కటే కాదు, తనకు వచ్చే ఇన్కమ్ తో మరియు మరికొన్ని donations తనకు చేతనయినంత సామాజిక సేవ చేస్తూ ఈ ఛానల్ 245 వీడియోస్ కు గాను 1.48 మిలియన్ subscribers తో 155 మిలియన్స్ వ్యూస్ తో నెంబర్ 8 ప్లేస్ లో ఉంది.
7) Amma Chethi Vanta -
ఈ లాక్ డౌన్ టైం లో youtube చూసే వాళ్ళలో 60% ఆడియన్స్ వంటల గురించి సరికొత్త రేసిపీస్ గురించి వెతికారు అని గూగుల్ కీ వర్డ్స్ చెబుతున్నాయి. అలంటి కుకింగ్ వీడియోస్ కు సంబందించిన తెలుగు ఛానల్ ఈ అమ్మ చేతి వంట. ఎప్పటికప్పుడు కొత్త కొత్త రేసిపీస్ తో , సింపుల్ గా అన్ని కూడా ఇంట్లోనే చేసుకోగలిగే విధంగా ఈ ఛానల్ ను వీడియోస్ ఉంటాయి. ఈ ఛానల్ లో వీడియోస్ చేసేది భార్గవి గారు. తెలుగు nativity కి అతిదగ్గరగా ఉండే వంటల రేసిపెస్ ఈ ఛానల్ ప్రత్యేకత . గత 2 సంవస్చారాల నుంచి 685 వీడియోస్ కు గాను 9లక్షల 60 వేలకు పైన subscribers తో 210 మిలియన్స్ వ్యూస్ తో ఈ టాప్ 15 లిస్టు లో 7 ప్లేస్ లో నిలిచింది ఈ ఛానల్.
6) wirally-
ఒక్క ఈ dialog కోసమే ఈ ఛానల్ లో వీడియోస్ చూసే ఫాన్స్ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. వెబ్ సిరీస్ తో పాటు షార్ట్ అండ్ స్వీట్ కంటెంట్ ను provide చేస్తూ అటు కామెడీ ఇటు లవ్ కం సెంటిమెంట్ కలిగిన వీడియోస్ తో సరదాగా 10 నిమిషాలు నవ్వుకునేల ఉన్ట్టాయి ఈ Wirally ఛానల్ లోని వీడియోస్. డైరెక్టర్స్, DOP, ఆర్టిస్ట్ ఇలా ఎదో ఒక దానిలో రానించాలి అని మూవీ ఇండస్ట్రీ చుట్టూ చెప్పులు అరిగేల తిరుగుతూ ఉంట్టారు కొంత మంది సినిమా ప్రేమికులు. టాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా జాబ్స్ చేసుకుంటూ షార్ట్ ఫిలిమ్స్ లో తమ ప్రతిభను చూపించోచ్చు అని నిరూపించారు ఈ Wirally టీం. Actual గా ఇది నా ఫేవరెట్ ఛానల్. Maximumఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతీ వీడియో చూస్తూ ఉంట్టా. ఈ ఛానల్ లో మొత్తం వీడియోస్ 291. రీసెంట్ గానే 1మిలియన్ subscribers మైల్ స్టోన్ ను రీచ్ అయ్యి 210 మిలియన్ వ్యూస్ తో ఆరవ ప్లేస్ ను దక్కించుకుంది.
5) VIVA -
Viva Harsha ఒక్క viva వీడియో తో సెలబ్రిటీ రేంజ్ కి వెళ్ళిపోయిన హర్ష ఆ తరువాత వెనక్కు తిరిగి చూసుకునే టైం కూడా లేకుండా చేసింది అతని ఫేం. అంతగా ప్రజల మనస్సులో ఒక కమెడియన్ గా ముద్ర వేసుకున్న హర్ష ఈ ఛానల్ లో కామెడీ కంటెంట్ తోమిగతా youtubers తో కలిసి వీడియోస్ అందిస్తారు. కేవలం 71 వీడియోస్ తో 1.25 మిలియన్ subscribers ని సపాదించాడు viva హర్ష . వ్యూస్ పరంగా కూడా సుమారు 217 మిలియన్ వ్యూస్ కేవల 71 వీడియోస్ తో అంటే అది సామాన్యమయిన విషయం కాదు. అందుకే viva ఛానల్ మన లిస్టు లో 5th ప్లేస్ లో ఉంది.
4) Vismai Food -
కిడ్స్ రేసిపీస్ దగ్గర నుంచి చైనీస్ , సౌత్ ఇండియన్ specials, ఆంధ్రా - తెలంగాణా స్టైల్ రేసిపీస్ , ఇలా మరెన్నో రకాల వంటలను చాల సింపుల్ గా ఎలా చేయాలో ఈ YouTube చానెల్ లో క్లియర్ గ explain చేస్తారు. వీడియో లో వంటలు తయారీ విధానం చెప్పే దగ్గర నుంచి వీడియో షూట్ చేసే పధతి వరకు ఒక quality ని మైంటైన్ చేస్తారు. గత 3 సంవస్చారాల నుంచి ఈ ఛానల్ లో 793 వీడియోస్ అప్లోడ్ చేసారు. ఈ వీడియోస్ కు గాను మొత్తం 1.46 మిలియన్ subscribers తో 343 మిలియన్ వ్యూస్ ను తన కాతాలో వేసుకుంది ఈ ఛానల్. మరి కొన్ని రోజుల్లోనే ఈ ఛానల్1.5 మిలియన్ మైల్ స్టోన్ ను రీచ్ కాబోతుంది.
3) My Village Show -
2) Mahathalli -
సరికొత్త షార్ట్ ఫిల్మ్ కంటెంట్ తో ఆడియన్స్ ను ఆశ్చర్య పరిచే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈ మహాతల్లి ఛానల్. web series , కామెడీ షార్ట్ ఫిలిమ్స్, మరియు మదర్ & డాటర్ కు సంబంధించి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఈ ఛానల్ ప్రత్యేకత అని చెప్పొచు. Jahnavi Dasetty అనే ఈమె ఈ ఛానల్ లో మదర్ డాటర్ , హీరో అన్ని తనే . ఈ షార్ట్ ఫిలిమ్స్ నుంచి డైరెక్ట్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టారు ఈమె. వీరు అందించే వీడియోస్ కంటెంట్ ఎంత క్వాలిటీ గా ఉంటుందో , వీడియో క్వాలిటీ కూడా అంతే రిచ్ గా ఉంటుంది. టోటల్ 240 వీడియోస్ కి 1.57 మిలియన్స్ subscribers మరియు 396 మిలియన్స్ వ్యూస్ తో టాప్ 2 ప్లేస్ లో నిలిచింది ఈ ఛానల్.
1) Grandpa Kitchen -
తెలంగాణా కు చెందిన Narayana Reddy గారే ఈ ఛానల్ లో హీరో . వయస్సు మీద పడిన తరువాత కూడా తన వంటలతో మన రాష్ట్రం, మన దేశం మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు గ్రాండ్పా కిచెన్. కేవలం 3 సవస్చారాలలో 7.59 మిలియన్ subscribers ను రీచ్ అయ్యారు అంటే అది మాటల్లో చెప్పలేం. దురదృష్టం ఏంటంటే 2019 అక్టోబర్ లో ఈయన మరణించారు. ఆ తరువాత కూడా ఈ ఛానల్ ఆయన legacy ని continue చేస్తూ వీడియోస్ ను అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఛానల్ లో 287 వీడియోస్ అప్లోడ్ అయ్యాయి. మొత్తం 7.59 మిలియన్ subscribers తో 838 మిలియన్ వ్యూస్ ఈ ఛానల్ సొంతం. అందుకే ఈ చానెల్ మన లిస్టు లోటాప్ వన్ లో ఉంది.
ఈ ఆర్టికల్ చదివే టైం లోపు ఈ అన్ని చానల్స్ లో వ్యూస్ కాని subscribers కాని లక్షల్లో పెరిగిపోయి ఉన్ట్టాయి కూడా. ఇక్కడ మీరి చూసిన లిస్టు లో మీకు నచ్చిన ఛానల్ మరియు ఈ లిస్టు లో లేని మీ favorite ఛానల్ పేరు ను కింద కామెంట్ లో రాసి అలాగే ఒక లైక్ తూ పాటు సబ్స్క్రయిబ్ కూడా చేసుకోండి.

No comments
If you have any doubts please let me know.